రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండల కేంద్రంలో అధికారుల తీరు విస్మయానికి గురి చేస్తోంది. మండల కేంద్రంలోని శివాజీ చౌక్ నుండి సాయి బాబా ఆలయం వరకు కొత్త సిసి రోడ్డు ను వేస్తున్నారు.

అయితే సిసి రోడ్డు వేస్తే మంచిదే కదా…. దీని పై ఎందుకు వార్త అంటున్నారా …
విషయం ఏమిటంటే సాయిబాబా ఆలయం వద్ద నుండి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు రోడ్డు గుంతలు పడి ఇబ్బందికరంగా ఉంది. కానీ అక్కడి నుండి ఓ 15 మీటర్ల తరువాత రోడ్డు లక్షణంగా ఎటువంటి గుంతలు లేకుండా శివాజీ చౌక్ వరకు ఉంది. అయిన అధికారులు అక్కడి దాకా దాని పై మరల సిసి రోడ్డు వేస్తున్నారు.

ఇచ్చోడ
గ్రామపంచాయతీ లోని ఇస్లాం పురా , రంజాన్ పురా కాలనీ వాసులు గత కొన్ని నెలలుగా తమ కాలనీల్లో బురదమయంగా ఉందని , రోడ్లు వేయాలని సౌకర్యాలు మెరుగుపరచాలని ధర్నాలు చేశారు. నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కానీ అధికారులు మాత్రం ఇలా నాణ్యత గా ఉన్న రోడ్డు పైనే మరల సిసి రోడ్డు వేయడం తో ఆ కాలనీ వాసులు విస్తుపోయారు. ఇక నైనా అధికారులు ఇలా ప్రజాధనం అవసరం ఉన్నచోట ఉపయోగించి , ప్రజాధనాన్ని కాకుండా ఉన్నతాధికారులు చూడాలని కోరుకుంటున్నారు . చిత్రం ఎలాంటి గుంతలు లేకుండా నాణ్యతగా ఉన్న రోడ్డు ను చూడవచ్చు. అదే విధంగా ఇస్లాం పురా, రంజాన్ పురా కాలనీ రోడ్ల పరిస్థితి చూడవచ్చు.
Recent Comments