రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : రక్తదానం వలన మరొకరికి పునర్జన్మను ప్రసాదించవచ్చని, ఆరోగ్య ఆదిలాబాదుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అన్నారు. శుక్రవారం రిమ్స్ ఆడిటోరియంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్, అల్ ఇండియా ఫిజిషియన్స్ అసోసియేషన్, రిమ్స్ జూడాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిభిరాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని, 18 సంవత్సరాలు నిండిన ఆరోగ్యవంతులు ఎవరైనా రక్తదానం చేయవచ్చని అన్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి వచ్చే గర్భిణీలకు, రోడ్డు ప్రమాదాల బాధితులకు, ఇతర వైద్యసేవలకు ప్రతి నిత్యం రక్త నిలువల అవసరం ఎంతో ఉంటుందని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని, వైద్యులు ప్రాణాలను కాపాడటంతో పాటు రక్తదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. దేశ అభివృద్ధికి సౌభాగ్యానికి ఆరోగ్యాంగా ఉండడం ఎంతో ముఖ్యమని, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ మెడికల్ అసోసియేషన్ సభ్యులు, జూనియర్ డాక్టర్లు సమన్వయంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం. అభినందనీయమని అన్నారు. ఇదే స్పూర్తితో జిల్లాలోని వివిధ స్వచ్చంద సంస్థలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని రక్తదాన శిబిరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా విధిగా నాలుగైదు సంవత్సరాలు వైద్యులు తమ సేవలను అందించేలా ముందుకు రావాలని సూచించారు. ఆర్గాన్ డినేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం రక్తదానం చేసిన వైద్యులకు కలెక్టర్ పండ్లు, అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, డాక్టర్లు మనోహర్, అశోక్, తిప్పా స్వామి, ఐఎంఏ, ఏపీఐ, జూడాల ప్రతినిధులు డాక్టర్లు ప్రమోద్ రెడ్డి, శ్యాంప్రసాద్, సుమలత, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, అక్షిత, రవి, తదితరులు పాల్గొన్నారు .
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments