విడిసిల అక్రమాల పై కఠిన చర్యలు తప్పవు
చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే
విడిసిల అక్రమ వసూళ్లకు దందాలకు సెటిల్మెంట్లకు అవకాశాలు లేవు
ప్రజలు వీడీసీల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలి
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఆదిలాబాద్, 02 jan 2026 : గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రజలకు భారంగా, ప్రజల వద్ద న్యాయస్థానాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించకుండా గ్రామ అభివృద్ధి పేరుతో వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.
గ్రామ అభివృద్ధి పేరుట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయబడతాయని అందులో భాగంగానే గత సంవత్సరం పలు కేసులను నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. గ్రామాలలో బెల్ట్ షాపులను, కళ్ళు దుకాలను, ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇవ్వడం వీడీసీలకు అర్హతలు లేవని స్పష్టం చేశారు. వారి అనుమతితో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహించే వారిపై మరియు విడీసీ లపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.
ఎవరైనా గ్రామ అభివృద్ధి వలన ఇబ్బందులు ఎదుర్కొనే వారు దగ్గరలో ఉన్న తమ పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని, భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి బహిష్కరణలకు వసూళ్లకు, దందాలకు వీడీసీలు పాల్పడిన యెడల కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలియజేశారు.


Recent Comments