కటౌట్ చూస్తూ – బ్రేకులు వేస్తూ – వేగం తగ్గిస్తున్న వాహన చోదకులు
* ప్రమాదాల నివారణకు సరికొత్త ఆలోచనతో జిల్లా పోలీస్ యంత్రాంగం.
* జాతీయ రహదారి పై హాట్ స్పాట్స్ వద్ద పోలీసు వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కటౌట్ ఏర్పాటు.
* గుడిహత్నూర్ మండలం మేకల గండి, నేరేడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద పోలీసు వాహనం మరియు కానిస్టేబుల్ కటౌట్ల ఏర్పాటు.
* పోలీసు వాహనాన్ని చూసి బ్రేకులు వేస్తున్న వాహనదారులు.
* వేగ నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లాలో రెండు చోట్ల పోలీసు కటౌట్లు ఏర్పాటు.
* పోలీసు ఉంటే వాహనానికి బ్రేకులు వేసినట్టే, ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లే
— జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి దూర దృష్టి మరియు మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా జాతీయ రహదారి – 44 పై ప్రమాదాల నివారణకు అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న హాట్స్పాట్లను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్ తో కూడిన కటౌట్ లను ఏర్పాటుచేసి ప్రజలు వాహనదారులు వేగ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా కృషి చేయడం జరుగుతుంది.



జిల్లాలో ప్రమాదాల ద్వారా ప్రాణ నష్టం పూర్తిగా నిర్మూలించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ గారి ఆలోచనతో జిల్లాలో గుడిహత్నూర్ మేకల గండి వద్ద మరియు నేరడిగొండ మండలం బంధం ఎక్స్ రోడ్డు వద్ద రెండు చోట్ల పోలీసు వాహనం మరియు ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించే విధంగా కటౌట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనం పోలీసులు ఉంటేనే వాహనదారులు ప్రజలు సరైన ట్రాఫిక్ నియమ నిబంధనలు వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలకు గురికాకుండా ఉంటారని తెలిపారు.

వాహనదారులకు స్వీయ వేగ నియంత్రణ లేకపోవడం ద్వారా గత రెండు సంవత్సరాలలో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రదేశాలను గుర్తించి ప్రాణనష్టాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా కటౌట్లను చేయించి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాహనదారులు పోలీసులను చూసి బ్రేకులు వేస్తూ వేగ నియంత్రణ చేస్తూ హెల్మెట్ ధరిస్తూ ఉండటం జరుగుతుందన్నారు. ప్రజల రక్షణకై జిల్లా పోలీసు యంత్రాంగం వినూత్న రీతిలో సేవలందిస్తూ తమదైన శైలిలో జిల్లా ప్రజలకు చేరువవుతున్నదని తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments