రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ :మండలం లోని దేగామ గ్రామానికి చెందిన ఉయికే నాగేశ్వర్ దంపతుల కుమారుడు ఉయికే శ్రీనివాస్ గత నెలలో ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాలలో ఉత్తీర్ణులై ఎంపీడీఓ గా నియామక పత్రం పొందారు. ఆ విషయాన్ని తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ తాను పుట్టి పెరిగిన ఆ గ్రామానికి తన సహచరులతో వెళ్ళి, నూతనంగా ఉద్యోగం పొందిన ఉహికే శ్రీనివాస్ ను వారి తల్లి దండ్రులను,శనివారం ఘనంగా సన్మానించారు.

శ్రీనివాస్ గ్రూప్ l లోనే కాకుండా గ్రూప్ 2 ,కి కూడా ఎంపికైనారు. శ్రీనివాస్ సోదరుడు కూడా గత సంవత్సరం హైదరాబాద్ లో ఎల్ ఎల్ బి.పూర్తి చేసి ప్రస్తుతం హై కోర్టు లో
ప్రాక్టీస్ ప్రారంభించిన సంగతి కూడా తెలుసు కొని,తన పుట్టిన ఊరినుండి ,
గిరిజన జాతిలోని ప్రధాన తెగకు చెందిన ఇద్దరు యువకులు ప్రయోజకులు కావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. వారిని సన్మార్గంలో చదివించి , ప్రయోజకులను చేసిన వారి తల్లిదండ్రులను చాలా మెచ్చుకున్నారు.
వారి వెంట బజార్ హత్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ జల్కె పాండురంగ్
రానున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో జడ్పీటీసీ పదవికి రేసులో ఉండదలచుకున్న జంగుబాపు, ఇతర కాంగ్రెస్ నాయకులు కార్య కర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments