Sunday, June 1, 2025

తండ్రిని చంపిన కేసులో కొడుక్కి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష

 

తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని బండరాయితో కొట్టి చంపిన కుమారుడు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: 

తాగుడుకు బానిసై డబ్బులు ఇవ్వనందున తండ్రిని చంపిన కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు  కొడుకుకి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష  విధించారు.  

కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…. 

ఫిర్యాదుదారు ముదిగంపల్లి లక్ష్మి w/o ముదిగంపల్లి బొందియాలు అనే మహిళ తన కూతురు బంధువులు చనిపోయిన కారణంగా జరిగే కార్యక్రమాలలో పాల్గొనడానికి తేదీ 25-07-2021 రోజున స్థానిక కేఆర్ కే కాలనీ కి వెళ్లినది. ఇంట్లో తన భర్త ముదిగంపల్లి బొందియాలు మరియు తన మూడవ కుమారుడు నేరస్తుడు *ముదిగంపల్లి సురేష్* లు ఒంటరిగా ఉండడం జరిగిందని తెలిపారు. ఫిర్యాదుదారు మహిళ మరసటి రోజు అనగా 26-07-2021 రోజున సాయంత్రం తిరిగి ఇంటికి రాగా వాకిట్లో తన భర్త *ముదిగంపల్లి బొందియాలు* రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించింది. తన మూడవ కుమారుడు *ముదిగంపల్లి సురేష్* తనను చూసి తండ్రిని చంపిన బండను పక్కకు పారవేసి పారిపోవడం గమనించింది.

 ఈ విషయాన్ని స్థానిక మావల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఫిర్యాదులో తన కుమారుడు సురేష్ తాగుడుకు బానిసై తన తండ్రితో తరచూ గొడవ పడుతూ డబ్బులు అడిగేవాడని, ఈ క్రమంలోనే డబ్బులు ఇవ్వనందున తన తండ్రిని చంపి ఉంటాడని ఫిర్యాదు చేసింది. 

అప్పటి మావల ప్రొబిషనరీ ఎస్ఐ డి రాధిక ఫిర్యాదును స్వీకరించి క్రైమ్ నెంబర్ 91/2021, u/sec 302 IPC కింద కేసు నమోదు చేసుకుని సీఐ కే పురుషోత్తం అప్పటి రూరల్ సీఐ కేసు విచారణ జరిపి చార్జ్ షీట్ దాఖలు చేయగా, ప్రస్తుత లైసెన్ ఆఫీసర్ జి పండరి మరియు కోర్టు డ్యూటీ అధికారి సిహెచ్ సంతోష్ లు 11 మంది సాక్షులను కోర్టు నందు హాజరుపరచగా పి పి ఎం మధుకర్  నేరాన్ని రుజువు చేయించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్ రావు తీర్పును వెలువరిస్తూ ముద్దాయికి *ఐదు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు ఒక వెయ్యి రూపాయల జరిమానా విధించడం జరిగింది అని కోర్టు లైసెన్ అధికారి జి పండరి గారు తెలిపారు.

 నిందితుడికి శిక్ష పడడంలో జిల్లా పోలీసు యంత్రాంగం సాక్షులను ప్రవేశ పెట్టడంలో కేసు విచారణ చేయడంలో కృషి చేసిన సిబ్బందిని *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్* ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి