రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి రాజర్షి షా పంచాయతి, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.
రేపటి నుండి మొబైల్ యాప్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని, ముందుగా అన్ని దరఖాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులను అనవసర ఇబ్బందులకు గురిచేయకూడదని, క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళడానికి ముందే దరఖాస్తుదారులకు సమాచారం అందిస్తే, వారు ప్లాట్ స్థలంలో అందుబాటులో ఉంటారని , క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా అది ప్రైవేట్ స్థలమేనా లేక ప్రభుత్వ స్థలమా అన్నది పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, డిపివో శ్రీలత, ఏవో, పంచాయితీ సెక్రటరీ లు, ఇరిగేషన్, రెవిన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
బఫర్ కండిషన్ మార్గదర్శకాలు, మాస్టర్ ప్లాన్ పై అవగాహన ఉండాలనీ తెలిపారు.


Recent Comments