Tuesday, October 14, 2025

మారుమూల గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లిన దేవ్ కీ నందన్ ఠాకూర్ జీ

అతొడక అసాధారణ వ్యక్తి , చిన్న తనం నుండే ఆధ్యాత్మికo వైపు మక్కువ పెంచుకుని 6 ఏళ్ల వయసులోనే బృందావనం లో చేరి అక్కడ వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, రామాయణ మహాభారతాలు వొంట పట్టించుకున్నడు, నాటకాలు వేస్తూ నిత్యం ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవారు. ఇప్పుడాయన అసామాన్య దేశ భక్తుడు జాతీయ భావాలు గల వ్యక్తి. రామాయణ, మహాభారత, భగవద్గీత కథకుడు, ఆయనో ఆధ్యాత్మిక గురువు. తాను కథను చెప్తుంటే వేలాది మంది కళ్ళార్పకుండా చెవులు పెద్దవిగా చేసుకుని వింటారు. ఆయన భగవద్గీత బోధిస్తే ఆయన వర్ణానికి మంత్రముగ్ధులై పరవశించి పోతారు. ఆయన చేసే కీర్తన, ఆలపించే గీతాలకు దేహం మైమరచి తన్మయత్వం తో నృత్యం చేస్తారు. ఆయన బోధనలకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధర్మ ప్రచారం కోసం విదేశాలలో బోధనలు చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు విశ్వశాంతి సేవా చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు.

Thank you for reading this post, don't forget to subscribe!


ఆయన చేసే పనులను ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ప్రశంసించారు.
ఆయన సేవలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం యూపీ రత్న అవార్డ్ ను అందించి సత్కరించింది.
ధర్మ ప్రచారం, హిందూ జీవన విధానం సంస్కృతి సంప్రదాయాలను ప్రచారం చేస్తూ హిందువులను ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు ఆయనే దేవ్కి నందన్ ఠాకూర్ జీ
భగవద్గీత పారాయణం లో బాగంగా తెలంగాణ లోని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని మథుర కులస్థులు నివసించే మారుమూల గ్రామం మాంజిరాం తాండా లో 7 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టారు. దాని విశేషాలు తెలుసుకుందాం.
మథుర కులస్థులు నివసించే చిన్న గ్రామం మాoజిరాం తాండ వారంతా గోపాలకులు, కృష్ణ భక్తులు, జగదాంబ దేవి బాలాజీ, జగన్నాథ్ ఆరాధకులు, మద్యం మాంసానికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో ఉండే గ్రామమది. గ్రామంలో భగవద్గీత పారాయణo చేయాలని గ్రామంలోని గురువు దర్యవ్ సింగ్ మహారాజ్ యొక్క ఆలోచన. దానికోసం సంవత్సరం ముందే ప్రణాళిక చేసి బృందావన నివాసి మథుర గ్రమస్తుడైన దేవ్ కి నందన్ టాకుర్ కి గీత ను బోధించడానికి ఆహ్వానించారు. దానికి వారు సరే అనడంతో చిన్న గ్రామంలోనే దాదాపు 2 లక్షలకు పైగా భక్తులకు సౌకర్యాలు కల్పించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 20 ఫిబ్రవరి 2023 నా ప్రారంభం అయిన కార్యక్రమం 26 ఫిబ్రవరి 2023 న ముగిసింది. 7 రోజుల్లో దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరై ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలారు.
రాధే రాదే అంటూ మర్మోగిన పల్లెలు
ఏడు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లాలలోని ఆదివాసీ గిరిజన ప్రజలు, పక్క రాష్ట్రాల భక్తులు అధికంగా హాజరై దేవ్ కి నందన్ ఠాకూర్ జీ కీర్తనలకు పులకించి పోయి రాదే రాదే, జై శ్రీ కృష్ణ, జై శ్రీరామ్ అంటూ తన్మయత్వం చెందారు. కార్యక్రమాలకు వెళ్ళేవారు వచ్చే వారు తమ నోటినుండి అసహజంగా వారికి తెలియకుండానే రాదే రాదే అంటూ స్మరించుకునే వారు అంతలా ప్రభావం చూపాయి ఆయన బోధనలు.

ఆకట్టుకున్న కృష్ణ లీలా నాటకం
కార్యక్రమంలో చేపట్టిన కృష్ణలీలా నాటకం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది, రాధ కృష్ణ వేషధారణలో కళాకారులు వేసిన వేషధారణ, నృత్య భంగిమ, సంకీర్తన, గీతాలు శ్రీ కృష్ణుడి లీలలను కళ్లముందు ఉంచాయి. దేవ్ కి నందన్ ఠాకూర్ గారి వర్ణన మంత్రానికి ప్రజలు మంత్ర ముగ్దు లయ్యారు.
గీతా పారాయణం చేస్తూనే ధర్మంగా ఎలా బ్రతకాలో బోధించారు. మహాభారత, రామాయణ కథలను ఉటంకిస్తూ జనాలను జాగృతం చేశారు.


దేవ్కినందన్ ఠాకూర్ జీ గారి అమృత వాక్కులు
దేవికి నందన్ మహారాజ్ మాట్లాడుతూ పశు పక్షదులను క బలివ్వడం మహా పాపమని ప్రతి మనిషి ఇది గ్రహించాలని, బలి ఇచ్చిన పశువులను జంతువులను మాంసాలను తినడం మహా పాపంగా భావించాలని అన్నారు.
వేల కోట్ల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మనిషికే ఉంటుందని మానవుడు ధర్మ బద్ధంగా జీవించాలని బోధించారు, ధర్మాన్ని రక్షించడానికి అధర్మాన్ని నాశనం చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు అవతరించడాని, ధర్మం నశించి అధర్మం ఎలుబడిగా ఉన్ననాడు ధర్మ రక్షణ కోసం భగవానుడు అవతరిస్తునే ఉంటాడని, దుష్ట శిక్షణ గావిస్తాడని అందుకు ప్రతీ వ్యక్తి సాటి మనిషిలో దైవాన్ని చూడాలని వీలైనంత సేవ చేయాలని అన్నారు.
నేటి సమాజం చెడు మార్గంలో నడవకుండా భక్తి మార్గంలో నడవాలని ప్రతి ఇంట్లో భగవంతుని చిత్రపటాలు మెడలో తులసీమాల ప్రతి రోజూ హనుమాన్ చాలిస పటించాలని ఇష్ట దైవాన్ని స్మరించాలని అప్పుడే ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటయని అన్నారు.
యువతకు మార్గనిర్దేశం
హిందూ ధర్మ సంస్కృతిని నేటి యువతీ యువకులు తెలుసుకుని రాబోయే తరానికి హిందూ ధర్మానికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలను అందించినప్పుడే మన ధర్మం, సంస్కృతి ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుందని అన్నారు.
యువతి యువకులు మద్యపానానికి మాంసానికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పాపం అంటే ప్రతి మనిషికి భయం ఉండాలని పాపాలు చేసే ప్రతి మనిషికి నరకం తప్పదని ప్రతి మనిషి దయాగుణం సాటి మనిషి పట్ల ప్రేమ, అభిమానం, దైవచింతన, దానధర్మాలు చేసే అలవాటు అలవర్చు కావాలని అన్నారు. పాపాలు చేసే ప్రతి మనిషి చివరికి నరకం తప్పదని గుర్తు చేశారు, ప్రతి మనిషి ఉన్నదాంట్లోనే తృప్తి పడాలని కానీ డబ్బు కోసం స్వార్థం కోసం విలాసవంతమైన జీవిత కోసం మరొకరిని బలి చేస్తూ అబద్ధాలు మాట్లాడి దొంగతనాలకు పాల్పడి అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు మనిషి పతనానికి దారి తీస్తాయని అన్నారు. కష్టపడ్డ వారికి శాశ్వతంగా ధనం వారి దగ్గర ఉంటుందని వారికే అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నారు. కుటుంబంలో భార్యాభర్తలు సుఖసంతోషాలతో ఉండాలంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవలని, భార్యాభర్తల మధ్య ప్రేమ అభిమానాలు ఉండాలని, తమ ఇంటి సమస్యలను మూడో వ్యక్తికి చెప్పకూడదని మనిషి ధనవంతుడైన పేదవాడైనా ఎప్పటికీ సాధారణ వ్యక్తిగా జీవితాన్ని గడపాలని అన్నారు.
అలాగే ఇంట్లో ఆడపడుచులకు, అమ్మా నాన్న లకు పాదలకు నమస్కరించి వారితో సంస్కారవంతంగా మెలగాలని, ప్రతీ ఆడవారిలో అమ్మను చూడాలని మార్గ నిర్దేశనం చేశారు.


ఆదివాసీ గ్రామాల సందర్శన, హరిజనులతో ముచ్చట
మంజీరo తాండా గ్రామానికి దగ్గర్లో గల ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. వారికి స్ఫూర్తిని ఇచ్చిన పోరాట యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి గోండుల సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకున్నారు. ఎన్ని కష్టాలెదురైనా వారు ధర్మ బద్దంగా, నిజాయితీ గా ఉండటం చూసి వారిని అభినందిస్తూ కష్టనష్టాలు ఎన్ని ఎదురైన ధర్మం తప్పొద్దొని చివరకు ధర్మం గెలిచి అధర్మం నశిస్తుందని అన్నారు. వారితో కలిసి ఆడి పాడారు. అన్యమతస్తుల మోస పూరిత మాటలు నమ్మి తల్లి లాంటి హిందూ మతాన్ని ఒదులు కుని కష్టాలకు గురి కావద్దని సూచించారు. గిరిజనులు వారి సంప్రదాయ గుస్సాడి నృత్యాలతో దేవ్ కి నందన్ గారిని గ్రామాల్లోకి ఆహ్వానించారు. అలాగే దళిత హరిజన వాడల్లో తిరిగి వారితో నృత్యాలు చేశారు. వారికి సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల గౌరవం ఉండాలని ధర్మం కోసం జీవించాలని, చదువు , సంస్కారం పెంపొందించుకోవాలని అన్ని అవకాశాలను వినియోగించుకుని ఉన్నత జీవనానికి అడుగులు వేయాలని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా పలు మండలాలు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి సందేషలిచ్చారు.
ఆలయాలు హిందువుల అధీనంలో ఉండాలి
దేవ్ కి నందన్ ఠాకూర్ జీ మాట్లాడుతూ హిందూ ఆలయాలు హిందూ సంస్థల ఆధీనంలో ఉండాలని, ప్రభుత్వాలు ఆలయాల బాధ్యత నుండి తప్పుకోవాలని అన్నారు. ఆలయాల నుండి వచ్చే ఆదాయం తోనే కొన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయని, ఆలయాల డబ్బుల ద్వారానే వేరే మతాలకు సబ్సిడీలు, నిధులు అందిస్తున్నారని ఆరోపిస్తూ ఆయ రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అలాగే హిందూ ధర్మాన్ని కాపాడే వారికే హిందువులంతా ఓట్లు వేయాలని సూచించారు.


మొత్తానికి దేవ్ కి నందన్ ఠాకూర్ జీ 7 రోజుల కార్యక్రమం జీవితంలో మర్చిపోలేనిది గా మథురాలు భావిస్తున్నారు. తమను ఆధ్యాత్మిక ఆనందంలో డోలలాడించి కృష్ణ భగవానుని లీలల్లో తన్మయత్వం చెందించిన దేవ్ కి నందన్ ఠాకూర్ మహారాజ్ గారికి అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలపకుండ ఉండలేక పోతున్నారు.
ఒక మారు మూల గ్రామంలో ఏర్పాటు చేసిన భగవత్ కథా కార్యక్రమం లక్షల మంది హిందువుల్లో చైతన్యం నింపి ధర్మం వైపు అడుగులు వేసిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రాధే…. రాదే
జై శ్రీరామ్…. వ్యాసకర్త – గాజుల రాకేష్, 9951439589

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!