రిపబ్లిక్ హిందుస్థాన్,ఉట్నూర్ : ఉట్నూరు డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఈరోజు మాదిగ ఉద్యోగ సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు.
అక్టోబర్ 24 న ఆదివారం రోజున హైదరాబాద్ లో మాదిగ ఉద్యోగ జాతీయ ఐదవ మహాసభలు జరుగనున్నాయి. ఈ మహా సభను విజయవంతం చేయవలసిందిగా మాదిగ ఉద్యోగులను కోరడం జరిగింది.
దీనికి జిల్లాలోని మాదిగ ఉద్యోగులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షుడు మేడపాటి ధనుంజయ్ కోరారు.
కరపత్రాలు విడుదల కార్యక్రమంలో మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
మేడపాటి ధనుంజయ్ మాదిగ ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు, పోన్నా గంగాధర్ మాదిగ ఉద్యోగ సంఘ రాష్ట్ర ఇంచార్జి నాయకులు, ముడిగ రాజేశ్వర్, టి.గంగన్న, బడుగు గంగయ్య, మొరే వెంకటి, కొమ్ము బాపురవ్, కాంబ్లే బాలాజీ దాసరి రాంప్రసాద్ ఆ రెల్లి మల్లేష్ మొదలగువారు పాల్గొనడం జరిగింది.


Recent Comments