— డి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : పది శాతం లేని రెడ్డి వెలుమలు ఈ తెలంగాణ రాజ్యాన్ని పాలించడం ఏమిటని డిఎస్ పి (దళిత శక్తి ప్రోగ్రాం ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ ప్రశ్నించారు. మంగళవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేరుకున్న సందర్భంగా భారీ ర్యాలీతో బీసీ,ఎస్సి, ఎస్టీ ప్రజలు ఘన స్వాగతం పలకగా ఆహ్వాన సభలో పాల్గొని మాట్లాడారు. 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ,ఎస్టీలు ప్రజలు కదా ఈ తెలంగాణను పరిపాలించాల్సిందన్నారు.

మన రాజ్యం వస్తే అట్టడుగు వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు సమకూరుతాయని అన్నారు. అగ్రవర్ణ పాలకులు పేద వర్గాలను రాజకీయ చైతన్యం కాకుండా మాయ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ గడ్డమీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం నెలకొల్పెందుకు ఈ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర చేపట్టామని దోపిడికి గురైన పేద వర్గాలు రాజ్యాన్ని ఏలాలన్నారు. మన ఓట్లతో అగ్రకులాలు సింహాసనం ఎక్కుతున్నారని మన శక్తితో వాళ్ళ భూముల్లో పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గ ప్రసాద్, అశోక్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గణేష్ , రహమాన్, నాయకపోడ్ సంఘం జిల్లా నాయకులు జనగ భీముడు, ఆదివాసీ నాయకుడు కుమురం కోటేష్, నాయి బ్రాహ్మణ సంఘం లక్ష్మి నారాయణ, మహర్ సంఘం నాయకులు కృష్ణ కుమార్, రేణుకుంట సురేష్, జిల్లా అధ్యక్షులు వెంకటేష్, డి ఎస్పీ మండల అధ్యక్షులు శేఖర్, అశోక్, లక్ష్మణ్, బీసీ ఎస్సి ఎస్టీ ముస్లిం నాయకులు పాల్గొన్నారు.


Recent Comments