Wednesday, July 2, 2025

సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్ హవర్ లో ఫిర్యాదు చేయాలి

సైబర్ క్రైమ్ అరికట్టడానికి అప్రమత్తతే ప్రధాన అస్త్రం…..

వారం రోజులలో ఆదిలాబాద్ జిల్లా నందు నమోదైన 13 ఫిర్యాదులు…..

ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, బెట్టింగ్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, ఇలాంటి పద్ధతులను వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు….

ఆన్లైన్ మనీ గేమింగ్ మరియు బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధం, వ్యతిరేకం….

– – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్


ఆదిలాబాద్: ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాల్లు ప్రజలను మోసగిస్తున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ, సైబర్ నేరగల పట్ల అప్రమత్తంగా ఉంటూ, సైబర్ నేరం జరిగిన  వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్ నందు సంప్రదించాలని సూచించారు.

మోసపోయిన బాధితులు గోల్డెన్ హవర్ లో, అనగా వెంటనే గుర్తించి ఫిర్యాదు చేస్తే సైబర్ క్రైమ్ బారిన పడిన వారికి న్యాయం చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేశారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం సమాజంలో వాట్స్అప్ నందు వీడియో కాల్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేస్తున్నారని, గుర్తింపు లేనటువంటి వెబ్సైట్లో వెతకడం వల్ల, ఓపెన్ చేయడం వల్ల, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల ఫోను హ్యాక్ అయ్యి, సోషల్ మీడియా నందు అశ్లీల ఫోటోలతో పోస్టులు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడడం జరుగుతుందని, బెట్టింగ్ యాప్స్ వల్ల యువత బెట్టింగ్లకు పాల్పడుతూ కష్టార్జితమైన సొమ్మును కోల్పోవడం జరుగుతుందని దానివల్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ యజమాని, నిర్వాహకుడు మాత్రమే చివరకు ధనవంతుడు అవుతారనే విషయాన్ని గ్రహించాలని యువతకు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని  అత్యాశతో ఫేక్ ఆప్స్ ల నందు ఇన్వెస్ట్మెంట్లలో డబ్బులు జమ చేసి మోసపోతున్నారని గ్రహించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా నందు ఇప్పటివరకు వారం రోజుల వ్యవధిలో 13 ఫిర్యాదులు నమోదు అయ్యాయని తెలిపారు.

ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేకంగా సైబర్ బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చే విధంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

అదిలాబాద్ జిల్లా నందు నమోదైన పలు కేసుల వివరాలు

1) ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మహిళ సోషల్ మీడియా అకౌంట్ ను సైబర్ క్రైమ్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తూ తన పేరుతో అకౌంట్ ను క్రియేట్ చేస్తూ సమాజంలో మహిళ పేరుని కించపరుస్తున్నారని ఫిర్యాదు చేయడం జరిగింది.

2) బాధితునికి ఫోన్ ద్వారా క్రెడిట్ కార్డును తీసుకొని ఆ కార్డు వివరాల ద్వారా ఆన్లైన్లో 27 వేల రూపాయల ఫ్రాడ్ ను చేయడం జరిగిందని, ఈ యొక్క ట్రాన్సాక్షన్ వివరాలు బాధితునికి సంబంధం లేకుండా జరిగాయని ఫిర్యాదు..

3) జైనథ్ మండలంలోని ఒక గ్రామంలో పిల్లలు ఆడుకునే గేమ్స్ ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ కావడం వల్ల బాధితుడి అకౌంట్ లో ఉన్న 21 వేల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది.

4) ఇచ్చోడ మండలానికి సంబంధించిన యువకుడు ఆన్లైన్ నందు ఫర్టిలైజర్స్ కొరకు వెతికి ఆన్లైన్ నందు ఒక ఫేక్ వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకుని వారి కోరిక మేరకు డబ్బులను పంపించడం జరిగింది. తదుపరి మోసపోయడని గ్రహించి సైబర్ క్రైమ్ ఆదిలాబాద్ ను సంప్రదించి ఫిర్యాదు చేశారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

Translate »
మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి