- సైబర్ నేరాల అడ్డుకట్టకు ప్రజలలో అవగాహన కీలకం – జిల్లా ఎస్పీ .
- మోసపోయిన వెంటనే తెలుసుకొని సైబర్ క్రైమ్ బ్రాంచ్ ను సంప్రదించాలి.
- బాధితునికి న్యాయం చేసి అభినందనలు తెలియజేసిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం.
- వివరాలలో….
- జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సైబర్ క్రైమ్ డిఎస్పి హసీబుల్లా ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ల లో, బస్టాండ్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యపరులైన ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ను సంప్రదించి సరైన సమయంలో న్యాయం జరిగి, పోయిన డబ్బును తిరిగి బాధితునికి అందించడం సంతోషకరంగా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. బాధితుడు స్థానిక ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ పర్వీజ్ ఈ నెల పదవ తారీఖున క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ ను లక్ష రూపాయలకు పెంచుదాం అంటూ ఫోన్ ద్వారా మాయమాటలు చెప్పి బాధితుడు ఎంతకైనా చెప్పకపోయేసరికి 6000 అదనపు డబ్బులను అందిస్తామని నమ్మబలికి మోసం చేసి బాధితున్ని యొక్క క్రెడిట్ కార్డు వివరాలు, సివివి, ఓటిపి నంబర్లను తెలుసుకొని 34,000/- రూపాయలను బాధితుడు ఖాతా నుండి తస్కరించడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాల చైతన్య పరుడైన సయ్యద్ పర్వేస్ తాను మోసపోయానని గ్రహించి వెంటనే 1930 సైబర్ క్రైమ్ నెంబర్ కి ఫోన్ చేసి, ఆదిలాబాద్ జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ను సంప్రదించడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆదిలాబాద్ వారు వెనువెంటనే బాధితుడు పోగొట్టుకున్న డబ్బులను తాత్కాలికంగా నిలిపివేసి, బాధితున్ని కి తిరిగి డబ్బులు వచ్చే విధంగా కేసును నమోదు చేసి విచారణ చేపట్టి తిరిగి అందించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు బ్యాంక్ అధికారులు అంటూ, పోలీసు అధికారులు అంటూ ఫోన్ చేసే వారి మాయమాటలు నమ్మవద్దని, వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ను గాని సంప్రదించాలని సూచించారు. కల్పించిన అవగాహనను వినియోగించుకోవడం, దానిని సద్వినియోగం చేసుకొవడం ఉత్తమ లక్షణం అని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు వెంటనే మోసపోయాడని గ్రహించినందుకు, సైబర్ క్రైమ్ ను సంప్రదించినందుకు, తిరిగి డబ్బులను అందజేసినందుకు జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి హసీబుల్లా, సిబ్బంది సింగర్వార్ సంజీవ్ కుమార్, సంతోష్, రియాజ్ పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments