
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడ మండలం లోని జామిడి గ్రామం లో ఆ ఇంట్లో ఒకటే బల్బు ఒకే టివి ఉంది. గత సంవత్సరం ఆ ఇంటికి డిసెంబర్ నెలలో ₹2317 రూపాయల వద్యుత్ బిల్లు వచ్చింది. వచ్చిన మొత్తం బిల్లును చెల్లించి రషీదు సైతం తీసుకున్నారు. కానీ సరిగ్గా ఓ నెల తర్వాత మళ్ళీ ఇప్పుడు విద్యుత్ శాఖ వారు ఇచ్చిన బిల్లును చూసి ఆ కుటుంబం వాళ్ళు కంగుతిన్నారు. ఇప్పుడు వచ్చింది వేయి, రెండు వెల బిల్లు కాదు ఏకంగా రూపాయలు ₹42928 విద్యుత్ బిల్లు వచ్చింది.
అదే విధంగా అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి గత సంవత్సరం డిసెంబర్ నెలలో రూపాయలు
3132 విద్యుత్ బకాయి ఉన్నట్లు బిల్లు వచ్చింది. కానీ జనవరి నెల అంటే సరిగ్గా ఒకనేలా తర్వాత రూపాయలు ₹30331 విద్యుత్ బిల్లు వచ్చింది.
అధికారుల తప్పిదమో ఏమో గాని గ్రామస్తులు మాత్రం భయందోళనకు గురవుతున్నారు.
అయితే ఇదే విధంగా మండలం లోని ఓ గ్రామం లో అధికంగా విద్యుత్ బిల్లు నమోదు చేసి తరువాత సెట్టిల్ చేసి కొంత అమౌంట్ తగ్గిస్తామని అన్నట్లు సమాచారం. దగ్గరుండి అమౌంట్ సెటిల్ చేసి తగ్గిస్తామనడం గమనార్హం.
Recent Comments