రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో జరిగిన అక్రమ లావాదేవీలా పై సోమవారం రోజులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాలు ఇప్పటిదాకా ఉన్నాయి. 17.03.2022 రోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అదిలాబాద్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ మహీ వివేక్ అదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి IRIX టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నియమింప బడిన బేటాల రమేష్ అనే కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ ( CSP ) / బ్యాంక్ మిత్ర అనునతడు మరియు కిసాన్ క్రెడిట్ కార్డు దారులు అయిన చిన్న సల్పలగూడ గ్రామానికి చెందిన మాడవి రాంబాయి , కోడప భీంరావ్ , కోడప గంగాదేవి లతో కుమ్మక్కు అయి బ్యాంక్ యొక్క అంతర్గత సాంకేతిక లోపాలని ఆసరాగా తీసుకొని పై ముగ్గురి కిసాన్ క్రెడిట్ కార్డ్ ( KCC ) కార్డుల ద్వారా తేదీ 21.09.2021 నుండి 17.02.2022 వరకు రూపాయలు 1,25,18,300 / – మోసపూరితంగా విత్ డ్రా చేసి స్వంతానికి వాడుకున్నారని ఫిర్యాదు చేసాడు. జేటాల రమేష్ CSP ఒక కార్డ్ పై లావాదేవీ కి రూపాయలు 10,000 / – చొప్పున ఒక నెల లో రూ .60,000 / – మాత్రమే విత్ డ్రా చేయాల్సి ఉండగా అట్టి నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్క కార్డ్ పై ప్రతి రోజు దాదాపు ఒక లక్ష రూపాయలు బయోమెట్రిక్ పరికరం ద్వారా కిసాన్ క్రెడిట్ ( KCC ) కార్డులను స్వైప్ చేస్తూ తేదీ 21.09.2021 నుండి 17.02.2022 వరకు బ్యాంక్ 1 ) . మడావి రాంబాయి కార్డ్ నుండి రూ . 72,78,000 / – , 2 ) . కోడప భీంరావ్ కార్డ్ నుండి రూ .35,00,200 / – , 3 ) , కోడప గంగాదేవి కార్డ్ నుండి రూ . 17,40,100 / – మొత్తం రు . 1.25,18,300 / – స్వైప్ చేసి తీసుకొని అందులో నుండి విడతల వారీగా 1 ) . మడావి రాంబాయి కి రూ .9,50,000 / – 2 ) . కోడప భీంరావ్ కు రూ .5,80,000 / – , 3 ) . కోడప గంగాదేవి కి రూ . 1,50,000 / – లకు ఇచ్చినాడు . ఇలాంక్ నుండి మోసపూరితంగా విత్ డ్రా చేసిన అమౌంట్ నుండి తన బందువు అయిన తిరుపతికి రూ .18,00,000 / – , రూ . 15,00,000 / – లు తన మూడవ అన్న స్వామి కి , తన నాల్గవ అన్న యగు గంగయ్య కు రూ .4,00,000 / – , తన రెండవ అన్న యగు ఆషన్న కొడుకు దత్తు కు రూ .4,00,000 / , తన పెద్ద అన్న శంకర్ కొడుకు అశోక్ కు రూ . 1,60,000 / – , తన గ్రామస్తుడు మడవి కిషన్ కు రూ .40,000 / – , కారే షేకన్న కు రూ .1,00,000 / – , రాందాస్ కు రూ .3,00,000 / – , సోనాల గ్రామానికి చెందిన తన అక్క యగు పోచక్క కొడుకు పోతన్నకు రూ .1 ,50,000 / – , మామిడికొరి గ్రామానికి చెందిన లక్ష్మణ్ కు రూ .50,000 / – , సంగ్వి గ్రామానికి చెందిన పరమేశ్ కు రూ .20,000 / లు , భట్టి సవరగాం గ్రామానికి చెందిన సతీష్ కు రూ .40,000 / – లు , శాంతినగర్ , అదిలాబాద్ కు
చెందిన చిన్నయ్య కు రూ .20,000 / – లు , అదిలాబాద్ కు చెందిన గోపి కి రూ .32,000 / – అప్పు గా తన గ్రామానికి చెందిన రాకేశ్ కు రూ .1,80,000 / – తను అప్పు ఉండగా తీర్చేసినాడు , తన యొక్క పంట ఋణం రూ .1,36,000 / – ఉండగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ , అదిలాబాద్ లో కట్టిసినాడు . ఇట్టి విషయాలపై తదుపరి విచారణ జరపాల్సి ఉంది . ఇట్టి మోసాన్ని బ్యాంక్ వారు గుర్తించి , తేదీ 18.02.2022 రోజు జటాల రమేష్ వద్ద నుండి రూపాయలు 44,83,510 / – మరియు బయోమెట్రిక్ పరికరం స్వాదీన పర్చుకున్నారు .
అదేవిధంగా మాడవి రాంబాయి వద్ద నుండి రూపాయలు 18,000 / – , గంగాదేవి వద్ద నుండి రూపాయాలు 90,700 / – మొత్తం రూ . 45,92,210 / – లను బ్యాంక్ వారు స్వాధీనపర్చుకున్నారు . తేదీ 20.03.2022 రోజున బెటాల రమేష్ మామిడిగుడ గ్రామం లో తన ఇంటి వద్ద ఉన్నాడనే సమాచారం మేరకు పోలీసు వారు వెళ్ళి బెటాల రమేష్ ను అదుపు లోనికి తీసుకొని , అతని వద్ద నుండి నగదు రూపాయలు 20,000 / – రూపాయలు 4,00,000 / – విలువ గల రెండు కెమెరాలు , రూపాయలు 80,900 / – విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనపర్చుకొని జెటాల రమేష్ ని అరెస్ట్ చేసి ఈ రోజు అనగా 21.03.2022 రోజు కోర్టు యందు హాజరు పరచడం జరుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎస్పీ ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ బి రఘుపతి, ఎస్ఐ ఏ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments