రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఆదివారం రోజు మధ్యాహ్నం2.00 గంటలకు ఒక వ్యక్తి నిషేధిత గంజాయితో వెళ్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో అతన్ని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి పట్టుకున్నారు.
ఇచ్చోడ సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమేష్ తెలిపిన వివరాల ప్రకారం… సిరికొండ మండలం కొండపూర్ గ్రామానికి చెందిన ఠాకూర్ ప్రతాప్ సింఘ్ అను వ్యక్తి వద్ద తనిఖీ చేయగా 1.5కేజీ ల ఎండు గంజాయి దొరికిందనీ తెలిపారు. అతడు ఇంద్రవెళ్లి మండలం కి చెందిన సునీల్ అను వ్యక్తి వద్ద గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముటకు తన మోటార్ సైకిల్ పై తీసుకొని వెల్లుచుండగా దుబార్పెట్ బ్రిడ్జి క్రింద పట్టుకొని విచారించగా నేరము ఒప్పుకొని తన వద్ద ఉన్న గంజాయిని చూపించినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా రూ.38000 వరకు ఉంటుందనీ తెలిపారు. వెంటనే అట్టి వ్యక్తిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరించినట్లు తెలిపారు.
Recent Comments