*వారం రోజుల్లోనే కేసును చేదించిన జైనథ్ పోలీసులు.*
*దొంగలించబడిన సొత్తు రికవరీ.*
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ :
జైనథ్ మండలం మాకోడ గ్రామంలో ఈనెల 11 వ తారీఖున నిమ్మల రవికాంత్ రెడ్డి ఇంట్లో పట్టపగలు చోరీ జరిగిందన్న పిర్యాదు మేరకు అదే రోజు సంఘటన స్థలాన్ని జైనథ్ సిఐ డి.సాయినాథ్ మరియు ఎస్సై పురుషోత్తం పరిశీలించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన *లక్ష్మీ* అనే మహిళ ఇంట్లో ఎవరు లేని సమయంలో, ఫిర్యాదుదారుడు ఇంటి కి తాళం చెవి వేసి తాళం చెవి ఇంటి ముందు ఉన్న గూట్లో పెట్టడాన్ని గమనించి ఎవరు లేని సమయంలో ఆ ఇంటి లోనికి ప్రవేశించి బీరువాలో గల సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు మరియు రూపాయల 40 వేల నగదును దొంగలించినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకోవడంతో పోలీసులు ఆమె వద్ద నుండి బంగారు ఆభరణాలను మరియు 39 వేల నగదును సీజ్ చేయడం జరిగింది. దొంగతనం చేసిన మహిళను డిమాండ్ కు పంపడం జరిగింది. ఇట్టి కేసులో చాకచక్యంగా వ్యవహరించి దొంగలించబడిన సొత్తును రికవరీ చేసినటువంటి జైనథ్ సిఐ డి సాయినాథ్ మరియు ఎస్ఐ పురుషోత్తం మరియు కానిస్టేబుల్స్ శివాజీ ,రాజు, స్వామి లను అదిలాబాద్ డి.ఎస్పి ఎల్.జీవన్ రెడ్డి గారు అభినందించడం జరిగింది.
ప్రజలందరూ గమనించగలరు బయటి ప్రదేశాలకు వెళ్లే ముందు ఇంటి తాళాలను ఇంటి పరిసరాలలో కాకుండా తమ వెంట తీసుకెళ్లాలని మనవి. అదేవిధంగా ఇంట్లోనే విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకు లాఖరులను ఉంచుకోవాలని తెలియజేశారు.
Recent Comments