జిల్లాలో పేకాట, మట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం సీసీఎస్ ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, జైనథ్ సీఐ కోల నరేష్, సీసీఎస్ సిబ్బందితో కలిసి పిప్పెర్వాడ టోల్ ప్లాజా వద్ద కొంతమంది అమాయక యువత వద్ద మట్కా నిర్వహణ చేస్తూ మహరాష్ట్ర లోని బోరి వద్ద గల అశోక్ సామ్రాట్, గోలురాయ్ లతో మట్కా నిర్వహణ జరుపుతున్న సమాచారం మేరకు ఉట్నూర్, హస్నపుర్ కి చెందిన 9 మంది మట్కా జుదరులు అయిన మడవి జంగు, మెట్ పల్లి పరమేశ్వర్, షేక్ ఇమ్రాన్, రమేష్, షేక్ సమీర్, అనిల్ కుమార్, వింప్ల రెడ్డి, ఉత్తమ్, కరణ్ లను పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 30,470 రూపాయల నగదు, (7)సెల్ ఫోన్లను, రెండు మోటార్ సైకిల్లు, ఒక ఆటో సీజ్ చేయడం జరిగిందనీ అధికారులు తెలిపారు. వారిపై జైనాథ్ పి.ఎస్ లో కేసు నమోదు చేయనున్నట్లు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ తెలిపారు. చాకచక్యంగా ఒకేసారి (9) మంది మట్కా జుదరులను పట్టుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ మరియు జైనథ్ సి.ఐ కోల నరేష్ మరియు సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.



Recent Comments