విధ్యుత్ ఘాతంతో చనిపోయిన కుటుంబానికి న్యాయం జరగాలని ధర్నా
కరెంటు చంపారు ఐదు లక్షలు మేము ఇస్తాం వాళ్లకు కూడా అదే కంబకు కట్టేస్తాం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడా మండలం లోని దుబార్ పేట్ బి గ్రామంలో విద్యుత్ ఘాతంతో చనిపోయినటువంటి రాయిసిడం చిత్రు అనే యువకుని మృతు కీ నిరసనగా దుబార్ పేట్ గ్రామస్తులు రోడ్డుమీద ధర్నా చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు చనిపోయి 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాధితులు రోడ్డు మీద బైఠాయించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తూ ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ ధర్నా వల్ల పెద్ద ఎత్తున వాహనాలు బస్సులు రాకపోకలు నిలిచిపోయాయి.


Recent Comments