రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం అరెస్ట్ చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!సిసిఎస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బొక్కలగూడా ప్రాంతం లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడం తో సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో ని బృందంతో కలిసి దాడి చేయగా నిందితుడు ముళ్ళ ఇమ్రాన్ (30) ఒక బేకరీ నందు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డాడని తెలిపారు. ఇతని వద్ద నుండి రూ.30,500 ల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎటువంటి అసాంఘిక చర్యలను సహించేది లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments