ప్రతి ఒక్కరూ సామజికబాధ్యతతోవ్యాక్సిన్ వేసుకోవాలనికోరిన :నిమ్మలప్రీతంరెడ్డి , ఎంపిపి, ఇచ్చోడ
15 నుండి 18 సంవత్సరాలు వయస్సు గల ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవాలని ఇచ్చోడ ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి కోరారు. కోవిడ్ బారి నుండి తమను తాము , దేశాన్ని రక్షించుకోవడానికి టీకా వేసుకోవడం తప్పనిసరి అన్నారు. సోమవారం 15 నుండి 18 సంవత్సరాల వారి కోసం వ్యాక్షినేషన్ వేసే కార్యక్రమాన్ని ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా 300 మంది విద్యార్థులు, యువకులు వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. బాధ్యతతో విద్యార్థులను వెంట తీసుకొని వచ్చి వ్యాక్సిన్ వేయించిన TTWRSJC ప్రిన్సిపాల్ రాజేంద్ర ప్రసాద్ ను మరియు డాక్టర్ సాగర్ ను ఎంపిపి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, ఎంపిటిసి నిమ్మల శివకుమార్ రెడ్డి , కదం బాబా రావ్ పటేల్ ఆసుపత్రి సిబ్బంది తదతరులు పాల్గోన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments