రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నేలల వెతనం అమలు దస్త్రం పై సంతకం చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి కాంట్రాక్ట్ ఉపాద్యాయులు పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు జాదవ్ వినంత్ రావ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉపాధ్యాయుల బృందం మాజీ మంత్రి గోడం నగేష్ మరియు ఎమ్మెల్యే జొగు రామన్న లను బోకే ఇచ్చి సాలువతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు జాదవ్ వినంత్ రావ్, గోడం శ్రీ నివాస్, పవార్ సోమేశ్వర్,పెది శ్రీనివాస్, కామేర శంకర్, యు.రమేష్, జే వంశీ, ఆర్ ప్రకాష్, కమలాకర్, ఆనిల్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments