రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : కాంగ్రెస్ పార్టీ పునర్‌వైభవం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యుడు నరేష్ జాదవ్ అన్నారు.సోమవారం సిరిచెల్మ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్‌గాంధీ,టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైమూదు ఖాన్,జిల్లా కార్యదర్శి భీమన్న,ఇచ్చోడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్,బోథ్ నియోజకవర్గ ఎస్సీ చైర్మన్ కొత్తూరు లక్ష్మణ్,బోథ్ నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా,గుడిహత్నూర్ మండల అధ్యక్షుడు మల్యాల కరుణాకర్,సిరిచెల్మ కాంగ్రెస్ నాయకులు జైపాల్,రాజేశ్వర్,మల్లేష్,గౌస్,సుదర్శన్ గౌడ్,బైరి లచ్చన్న,కాల భూమయ్య,సిద్ధిక్,వహీద్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments