రిపబ్లిక్ హిందూస్ధాన్ , గుడిహత్నూర్ : గుడిహత్నుర్ మండల కేంద్రం లో భారత దేశ ఉక్కు మహిళ, భారత రత్న, మాజీ మహిళ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జయంతి వేడుక ల సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, స్వీట్లు, పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్యాల కరుణాకర్ , బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ వసంత్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం కోసం పోరాడుతు, కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కృషి చేస్తాం అని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో లో బోథ్ నియోజకవర్గ నాయకులు జాదవ్ వసంత్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్యాల కరుణాకర్ మండల ప్రధాన కార్యదర్శి ఉయాక శ్యామ్ రావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు కుమ్రా బీర్ సాబ్ మండల కార్యదర్శి రామారావు, ఆరిఫ్ ఖాన్ జిల్లా మైనార్టీ నాయకులు జుబేర్, ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ సుద్దాల రాజు, ఎస్సీ సెల్ మండల నాయకులు శ్యామ్ రావు మండల కాంగ్రెస్ నాయకులు మదన్ ,మాడవి వెంకట్రావు ,లక్ష్మణ్ కోవా బాపూరావు , నగేష్. తదితరులు పాల్గొన్నారు.
Recent Comments