— బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజెందర్
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, నేరడిగొండ : మండలంలోని వాంకిడి, పాషా తండా గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గ్రామంలోని ఇండ్ల పైకప్పులు కూలిపోవడంతో బాధితులకు నివాసాలు లేక రోడ్డునపడ్డారు.
కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజెందర్ ఆయా గ్రామాలకు చేరుకుని కూలిన ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శించారు. వారికి కావాల్సిన నిత్యవసర సరుకులు మరియు పైకప్పు తాత్కాలికంగా కప్పు కోవడానికి పారీలు ( టార్పాలిన్లు) బాధితులకు అందచేశారు. వారిలో మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మీడియాతో మాట్లాడారు. బోథ్ నియోజకవర్గంలో ఇండ్లు కోల్పోయిన ప్రతీఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని, వర్షం వలన కూలిపోయిన ఈ ఇండ్లను ప్రభుత్వం తక్షణమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సామాన్లు పాడై దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న బాధిత కుటుంబాలకు ఆర్దిక సహాయం అందించాలని అన్నారు. అధికారులు వచ్చి వెళ్ళడంకాక వారి సహాయసహకారాలు వెంటనే అందేలా చూడాలని అధికారులను కోరారు. అదేవిధంగా శాసనసభ్యలు రాథోడ్ బాపురావు , పార్లమెంట్ సభ్యులు సోయం బాపు రావు గ్రామ పర్యాటన చేసి బాధితులకు అండగా నిలిచి వారికి లబ్ది చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేసారు. అలాగే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఇలాంటి సంఘటనల పై వేగంగా స్పదించి ఇలాంటి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పేదవాడి కల నెరవేరుస్తారని ఆ దిశగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి యం.డి.సద్దాం, వాంకిడి విడిసి అధ్యక్షుడు మర్ల శ్రీనివాస్, ఉప సర్పంచ్ షేక్ అలిం, నాయకులు చౌహాన్ రవీందర్, శంకర్, పర్వేజ్, సలీం, నాయకులు గ్రామ ప్రజలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments