🕳️ ఎంఐఎం కి ఓటు వేసింది మీరు కాదా ఎన్నికల కోసం ఇప్పుడు జైశ్రీరామ్ ఎత్తుకొని హిందువులను మరొక్కసారి మోసం చేయడానికి ముందుకు వచ్చారని మేము, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు : కాంగ్రెస్
సోంత మండలం బజార్హత్నూర్ ప్రభుత్వ కార్యాలయాలు, గిరిజన గ్రామాలకు కరెంటు, మంచినీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం కల్పించని మీరు ఉమ్మడి ఆదిలాబాద్ ని ఏం అభివృద్ధి చేస్తారు*
*ఓటమి భయంతోనే బిజెపి నేతలచౌకబారు మాటలు*
*ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ పార్లమెంట్ బిజెపి టిఆర్ఎస్ చేసిందేమీ లేదు*
*ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలకు గోడం నగేష్ క్షమాపణలు చెప్పాలి*
*సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఈ జిల్లాకు చేసిందేమీ లేదు*
*జీవో నెంబర్ 3 వైఖరి ఏమిటి*
*ఎన్నికల రాజకీయ లబ్ధి కోసమే ముఖ్య మంత్రిపై విమర్శ*
*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ, జన జాతర సభ విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు*
*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి*
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన జన జాతర సభ విజయవంతం అవడంతో బిజెపి పార్టీలో ఓటమి భయం చుట్టుకుందని అందుకే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపైన అవాకులు చేవాకులు పేల్చి చౌకబారు విమర్శలు చేసిన గోడం నగేష్ ఆత్మ విమర్శ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి డిమాండ్ చేశారు
ఇచ్చోడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గోడం నగేష్ చేసిందేమీ లేదని పదేళ్ల ప్రత్యేక పాలనలో టిఆర్ఎస్ బిజెపి ఆదిలాబాద్ జిల్లాకు ఏనాడు ప్రత్యేక నిధులు సమకూర్చలేదని అభివృద్ధికి దూరంగా ఉంచిన వారే అభివృద్ధి గురించి మేము మాట్లాడితే మాపై విమర్శలు చేస్తున్నారని ఈ విధానం, వైఖరి మార్చుకోకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు
*GO NO:03*
జీవో నెంబర్ 3 తాను కేబినెట్ మినిస్టర్ గా ఉన్నాడు తీసుకొచ్చాను అని చెబుతున్న ఈ పెద్ద మనిషి అధికార బీఆర్ఎస్ పార్టీలో ఉండి, జీవో నెంబర్ 03 రద్దు చేసేటప్పుడు ఆదివాసి గిరిజనులవైపు మాట్లాడకుండా అధికార పార్టీకి కొమ్ము కాసి కనీసం సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కకుండా మరొక్కసారి ఆదివాసీల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు
*గోడం నగేష్ జిల్లా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి*
తెలంగాణ విభజన హామీలు ఆదిలాబాద్ జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎంపీగా ఉన్న మీ ఇంటికి వస్తే నాతో పాటు 11 మందిపై కేసులు పెట్టింది నిజం కాదా?? ఏ ఒక్క రోజైనా అప్పటి ముఖ్యమంత్రిని గిరిజన యూనివర్సిటీ గురించి, జిల్లాకు జనరల్ యూనివర్సిటీ గురించి మాట్లాడినారా!?
*నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల*
బోథ్ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల లేదని ఏర్పాటు చేయాలని 10 సంవత్సరాలు డిమాండ్ చేస్తే ప్రజల డిమాండ్ ను పక్కనపెట్టి ప్రైవేటు కాలేజీకి అనుమతులు ఇప్పించి డిగ్రీ కళాశాల రాకుండా అడ్డుకున్నది మీరు కాదా కాబట్టి మీరు క్షమాపణ చెప్పాలి?!
కుప్టీ ప్రాజెక్టును ఇదిగో ప్రాజెక్టు అదిగో ప్రాజెక్టు అంటూ ఇన్ని సంవత్సరాల వరకు రాకుండా, అడగకుండా ఉండి బోథ్, ఖానాపూర్ నియోజకవర్గం నీళ్లు అందకుండా చేసిన మీరు క్షేమపన చెప్పాలి!?
*ఆదిలాబాద్ జిల్లాకు బిజెపి చేసింది ఏమీ లేదు*
పది సంవత్సరాల బిజెపి టీఆర్ఎస్ పాలనలో సిసిఐ గురించి మాట్లాడని మీరు, తుమ్మడిశెట్టి ప్రాజెక్టు గురించి మాట్లాడని మీరు, ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుల నియామకం గురించి మాట్లాడని మీరు, ఆదిలాబాద్ -ఆర్మూర్ రైల్వే లైన్ గురించి మాట్లాడని మీరు ఈరోజు ఎన్నికలవేళ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది
*ఇంద్రవెల్లి ఘటన గురించి*
ఇంద్రవెల్లి ఘటన గురించి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనకు క్షమాపణలు కోరుతూ ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని, ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం చుట్టూ స్మృతి వనం ఏర్పాటు చేస్తామని, వారికి ప్రభుత్వంలో, సమాజంలో తగిన గుర్తింపుని ఇస్తామని ప్రకటించిన విషయం విధితమే కానీ ఇన్ని రోజులు ఇంద్రవెల్లి గురించి మాట్లాడని మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మంత్రిగా ఉండి కనీసం అమరవీరులకు నివాళులర్పించుకోవడానికి వీలు లేకుండా 144 సెక్షన్ పెట్టించింది మీరు కాదా?, ఇంద్రవెల్లి అమరవీరులు ఏ హక్కుల కోసమైతే పోరాడినారో ఆ హక్కులు భూమిపై హక్కులు ఇచ్చింది, వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది మౌలిక వసతులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కదా!? కేవలం ఎన్నికల కోసమే ఇంద్రవెల్లి ఘటనను మీడియా ముందుకు తీసుకువచ్చి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విన్నపం
ఆదివాసులు భూయాజమాన్య హక్కులు రావాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోయపోచమ్మగూడ ఆదివాసి మహిళలపై వారిని వివస్త్రాలు చేసి జైలుకు తరలించినాడు గోడం నగేష్ గారు ఎందుకు స్పందించలేదు? కనీసం వారిని ఎందుకు ప్రశ్నించలేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ అడుగుతుంది!?
అడవి నుంచి ఆదివాసి గిరిజనులను గెంటివేసే విధంగా కార్పొరేట్లకు మైనింగ్ అనుమతులు ఇచ్చే నూతన ఫారెస్ట్ కన్జర్వేటివ్ యాక్ట్ ఎందుకు వ్యతిరేకించలేదు దానిపైన ఎందుకు మీరు అడగలేదు ఆదివాసీలను ఎందుకు ఐక్యం చేయలేదు బిజెపి పార్టీని ఈ విషయంలో ప్రశ్నించే దమ్ము ఆదివాసుల వైపు నిలబడే దమ్ము ధైర్యం మీకు ఉన్నాయా అని సవాలు విసురుతూన్నాం
*ఆదివాసుల విద్య గురించి కపట ప్రేమ చుయించిన మీకు*
ఇప్పటికీ ఆదివాసిగూడెలలో ప్రత్యేక రాష్ట్రంలో కూడా మీరు అధికారంలో ఉండగా ఎన్ని అంగన్వాడీలు, భవనాలు సాంక్షన్ చేయించారు?
ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేసి గ్రామపంచాయతీ బిల్డింగులుగా మార్చినాడు ఈ ఆదివాసి బిడ్డల ఈ గిరిజన బిడ్డల చదువు గురించి ఏనాడైనా మాట్లాడారా!?
హైమన్ డార్ప్ ఉపాధ్యాయ ట్రైనింగ్ సెంటర్ మూసివేసిన నాడు ఎందుకు ఈ గిరిజన బిడ్డల గురించి మీరు మాట్లాడలేదు!?
2008లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేంద్రంగా ఏర్పాటుచేసిన బి.ఎడ్ కళాశాల లెక్చరర్ పోస్టులు ఈ 10 సంవత్సరాలలో ఎందుకు నియమించలేదు మీరు ఎందుకు అడగలేదు!?
బోథ్ నియోజకవర్గానికి వచ్చిన గిరిజన మహిళ గురుకుల కళాశాల తరలి వెళ్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు!?
వ్యక్తిగతంగా ఇంత మాట్లాడిన మీరు ఆదివాసీలపై ప్రేమ ఉంటే ఏ ఒక్క రోజైనా ఈ గిరిజనుల కోసం ఒక్క ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించి ఎంతమంది నిరుద్యోగులను ఉద్యోగాలకు సిద్ధం చేశారు చెప్పగలరా!?
నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకు న్యాయంగా రావలసిన సైనిక్ స్కూల్, నవోదయ పాఠశాల, ఇతర జాతీయ సంస్థలు రాకుండా అడ్డుకున్నది ఎవరు, విషయంలో మీరు ఎందుకు ఈ జిల్లా ప్రజల తరఫున మాట్లాడలేదు అని కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా మిమ్మల్ని అడుగుతా ఉంది!?
సొంత మండలం బజార్హత్నూర్ లో ఎమ్మార్వో కార్యాలయం సొంత భవనం నిర్మించని మీరు, సొంత మండలంలో గిరిజాయి, డేడ్ర, ఉమర్ డా, కొత్తపల్లి గ్రామానికి బ్రిడ్జి, మోడల్ కళాశాల వరకు సిసి రోడ్డు వేయించని మీరు ఆదిలాబాద్ జిల్లాకు ఏదో చేస్తారన్న భ్రమలో ప్రజలు లేరని మీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది
తెల్లవారితే బిజెపి పార్టీ మైనార్టీల మీద ఎంఐఎం మీద విద్వేషం వెళ్లగకే మీరు బైంసా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎంఐఎం కి ఓటు వేసింది మీరు కాదా ఎన్నికల కోసం ఇప్పుడు జైశ్రీరామ్ ఎత్తుకొని హిందువులను మరొక్కసారి మోసం చేయడానికి ముందుకు వచ్చారని మేము, ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు .
ఈ సందర్భంలో మీ కుటుంబ రాజకీయ నీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతురాలు, ప్రజా జీవితం గడిపిన మచ్చలేని నాయకురాలు ఆత్రం సుగుణ గెలుపు కోసం ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ కోంరం కోటేశ్వర్, ఇచ్చోడా మండల అధ్యక్షులు కళ్ళేం నారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమూద్ ఖాన్, ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు కొత్తూరు లక్ష్మణ్, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు ముస్తఫా, శంకర్ పటేల్, మధుకర్, ఆశన్న, తుకారం తదితరులు పాల్గొన్నారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments