అదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్ : అదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ లో గల ఉర్దూ హైస్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్య జ్యోతి ఎడిటర్ కె నరేష్ కుమార్ జన్మదిన సందర్భంగా కంపాస్ బాక్సులు పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ప్రముఖ న్యాయవాది శ్రావణ్ నాయక్, సానియా, హేమలత, గంగన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు లేదా వృద్ధులకు ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
Thank you for reading this post, don't forget to subscribe!
బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టే పలు కార్యక్రమాలకు ఎడిటర్ కె నరేష్ కుమార్ సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఏమి ఈ సందర్భంగా ఎడిటర్ కె నరేష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని తెలిపారు. మన సంపాదించే సంపాదనలో మనకు తోచినంత సహాయ సహకారాలు పేదలకు అందించినప్పుడే ఆ సేవలకు గుర్తింపు వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పిల్లల జన్మదిన సందర్భంగా కానీ తల్లిదండ్రుల జన్మదిన సందర్భంగా పెళ్లిరోజులు ఇతర శుభకార్యాలలో భాగంగా పేదలకు ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని నరేష్ కుమార్ సూచించారు.
Recent Comments