ఆదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 29: ఆదిలాబాద్ జిల్లా SP శ్రీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు, ఉట్నూర్ అదనపు SP కాజల్ సింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం ఇచ్చోడ మండలం గుండాల గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో తగిన రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా ఉన్న 36 బైక్‌లు, 6 ఆటోలు, 2 ట్రాక్టర్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తరువాత అదనపు SP కాజల్ సింగ్ IPS గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, పోలీసుల సేవలు ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ కొనసాగుతాయని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు.

అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, నేరం జరిగిన 24 గంటల్లోపే 1930 నంబరుకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. మాదకద్రవ్యాల (గంజాయి, డ్రగ్స్) వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు.
సెకండ్‌హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసిన వెంటనే తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అలాగే ప్రతి వాహనదారుడూ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చోడ CI బండారి రాజు, SI లు వి. పురుషోత్తం, ఎల్. శ్రీకాంత్, ఇమ్రాన్, పూజ, ఇచ్చోడ సర్కిల్ పోలీసు సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.


Recent Comments