రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చొడ : కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న 3 రైతు చట్టాల పై శనివారం రోజున స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ లో తెరాస పార్టీ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్నాచౌక్ లో కేసీఆర్ అధ్యక్షతన మహా ధర్నాను నిర్వహించడముతో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ వెంటనే స్పందించి మూడు రైతు వ్యతిరేక చట్టాలను వాపసు తీసుకున్నారని అన్నారు. ఖరీఫ్ లో పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని,రబి ధాన్యం కొనుగోలు చేయడం గురించి రెండు రోజుల్లో పరిశీలిస్తామని చెప్పడం తెరాస విజయమని అన్నారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తెలంగాణ రైతాంగ విజయమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండగా ఉండే రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు.
ఈ కార్యక్రమములో ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, మాజీ కన్వీనర్ మెరాజ్ హమ్మద్, వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, దాసరి భాస్కర్, సుద్దవార్ వెంకటేష్, రాథోడ్ ప్రవీణ్, నర్వడే రమేష్, హారన్ రామేశ్వర్, గాయకాంబ్లీ గణేష్, రాథోడ్ ప్రవీణ్,సాబీర్,భీముడు,రాజేశ్వర్,అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు..
Recent Comments