— రూ.15000/- విలువగల అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం చేసుకున్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి*
— కలప, వాహనం స్వాధీనం ఫారెస్ట్ అధికారులకు అందజేత,నిందితుడి పరారీ
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్- క్రైం :
సోమవారం అర్ధరాత్రి అక్రమంగా కలప తరలిస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలోని బృందం ఆదిలాబాద్ పట్టణం ఖుర్షీద్ నగర్ నందు తనిఖీ చేయగా మారుతీ వాహనంలో 3 దుంగలు 6 ఫీట్ల పొడవు కలిగిన 15 వేల రూపాయల విలువ చేసే కలప తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. పోలీసులను చూసి డ్రైవర్ కలిమ్ s/o నిజాం తాటిగూడ కు సంబంధించిన వ్యక్తి పరారయ్యారని తెలిపారు. సంబంధిత కలపను ఫారెస్ట్ అధికారులకు ఆదిలాబాద్ డిప్యూటీ రేంజర్ ఇబ్రహీం షరీఫ్ లకు తదుపరి దర్యాప్తు కోసం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ ఆపరేషన్లో సిసిఎస్ ఎస్ఐ అశోక్ సిబ్బంది రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments