డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం….పలువురికి గాయాలు
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ : ఇచ్చోడా మండలం ఫైర్ స్టేషన్ సమీపంలో మధ్యప్రదేశ్ భోపాల్ కు చెందిన బస్సు బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులైన ఫైర్ స్టేషన్ సిబ్బంది పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 3.30 సమయంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుండి హైదరాబాద్ వైపుకు వెళ్తున్నా ప్రయివేట్ బస్సు ( MP04PA5632) ఫైర్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చి బోల్తాపడింది. ఇది గమనించి వారు అక్కడ వెళ్లి చూడగా అందులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు.

తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిలో గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తగా ,అతివేగంగా బస్సు నడపడం తో ప్రమాదం జరిగిందని , ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.


Recent Comments