రెండురోజుల క్రితం రోడ్డు సౌకర్యం లేక మరణించిన మడావి రాజుబాయి భర్తకు 25 వేల సహాయం అందజేత….
భవిష్యత్తు లో ఇలా జరగకుండా చూస్తాము….
రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ :
గ్రామస్తుల ఫీడ్ బ్యాక్ తీసుకొని సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గాదిగూడ మండలం కొనికస కొలంగూడా లోఈ నెల 22 న మరణించిన గర్భినీ మాడావి రాజుబాయి భర్త మాడావి జంగు ను కలెక్టర్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి మంగళవారం రోజున పరామర్శించారు. తాత్కాలిక రిలీఫ్ క్రింద 25 వేల రూపాయల చెక్కును జంగు కు అందజేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సిబ్బంది పనితీరును సమీక్షిస్తామని, విచారన జరిపి బాద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనికస కొలామ్ గిరిజనులకు రవాణా సౌకర్యం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని, వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఎస్టిమేట్ తయారు చేయిస్తామని, అత్యవసరంగా పాత రోడ్డును పరిశీలించి సౌకర్యం కలిగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపడతామని అన్నారు.


వర్షాకాలంలో గర్భిణీలకు ప్రత్యేకంగా వైద్య సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి భవేశ్ మిశ్రా మాట్లాడుతూ గిరిజన గర్భిణీ లకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తూ మానిటరింగ్ చేస్తామని తెలిపారు. కొలామ్ గిరిజనులకు అవగాహన లోపం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, కొలామ్ భాషలో కొలామ్ కళాకారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
రోడ్డు, వంతేన నిర్మాణానికి తొందరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తుల సహకారంతో సమస్యలను ఆదిగమిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న వాగును కలెక్టర్ , పి.ఓ ,అధికారులు దాటారు. మారుమూల గిరిజన గ్రామాన్ని అధికారులతో సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ రమణ, ఈ ఈ భీంరావ్, డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఐటిడిఎ అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments