Friday, August 29, 2025

Adilabad : బీఆర్ఎస్ లో రెండు వర్గాల ‘ఆత్మీయ’ వర్గ పోరు

ఎమ్మెల్యే ఆత్మీయ సమ్మేళనం vs ఎంపిపి భరోసా పథకాలు శ్రీ రామ రక్ష

Thank you for reading this post, don't forget to subscribe!

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ : ఒకపక్క మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావాలని చూస్తున్నా బిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తూ ఉంటే బోథ్ లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా కనబడుతోంది.  ఆ పార్టీ అంతర్గత పోరు చూస్తూ ఉంటే ప్రతిపక్షాల పోటీ ఏమో గాని బీఆర్ ఎస్ పార్టీ వాళ్లే ఓట్లు పంచుకునేల  కనిపిస్తున్నరూ.  ఆదివారం రోజు బోథ్ నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ  చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆధ్వర్యంలో ఒక పక్క మరోపక్క బోథ్  ఎంపీపీ తుల శ్రీనివాస్ సేపరేట్ గా మరో ఫంక్షన్ హల్ లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం నియోజవర్గంలో  హాట్ టాఫిక్ గా మారింది.    ఒకే ఊర్లో ఒకేరోజు ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వేరు వేరుగా పోటాపోటీగా  ఆత్మీయ సమ్మేళనాలు  జరుపుకోవడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని పైనే చర్చ నడుస్తోంది.  ఇప్పుడు ఇదే హార్ట్ టాపిక్ గా మారింది.

జిల్లా వ్యాప్తంగా సంచలనం గా మారింది.  ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం లో ప్రస్తుతం రాజకీయం ఏదో ప్రతిపక్ష పార్టీ కోరుతూ హీట్ ఎక్కుతుంది అంటే మీరు పొరపడినట్లే టిఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత పోరుతో ఎప్పుడూ ఆ నాయకులు వార్తల్లో నిలుస్తున్నారు ఆదివారం బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం ఓవైపు జరుగుతుంటే మరోవైపు ఎంపీపీ తూలసిరినివాస్ అదే గ్రామంలో మరోచోట ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని చేపట్టారు విస్తు గొలుపే విషయమే అయినా ఆ పార్టీలో సఖిత లోపం ఉన్నదని అంతర్గత పోరు తారస్థాయి చేరింది అనడానికి ఇదే నిదర్శనం అయితే ఎంపీపీ చేపట్టే అటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరవుతారని ముందుగా ప్రచారం జరిగింది కానీ ఆ తర్వాత మరింత ఆద్యం పోసినట్లు అవుతుంది అనుకున్నారు ఏమో వారు మాత్రం ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు ఒకేరోజు ఒకే పార్టీ ఒకే గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు రెండు వేరువేరు ప్రదేశాల్లో జరిగాయి ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతం బూత్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే చేర్చే కొనసాగుతుంది

బోథ్ మండల కేంద్రంలో ఉద్రిక్తత..

ఒకే పార్టీకి చెందిన పోటా పోటి ఆత్మీయ సమ్యేళనాలతో వేడెక్కిన బోథ్ రాజకీయం.
ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆత్మీయ సమ్మేళనానికి పోటిగా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ బీఆర్ఎస్ పథకాలతో భరోసా, కేసిఆరే శ్రీరామ రక్ష పేరిట మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

తుల శ్రీనివాస్ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాల్ కు తాళం వేసిన ఫంక్షన్ హాల్ యజమాని పోలిసులు చెప్పడంతోనే గేటుకు తాళం వేశారని ఎంపీపీ అనుచరుల ఆందోళన దిగారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాళం తాయకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఎంపిపీ హెచ్చరించడంతో ఫంక్షన్ హాల్ తాళాలను పోలీసులు తెరిపించారు. 

తాళం తీయడం యదా విధిగా ఎపిపి ఆధ్వర్యంలో ని ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కొనసాగి వివాదం సద్దుమణిగింది.

ప్రతిపక్షాల విమర్శలు అవసరం లేకుండా స్వపక్షం ఇలా ఎప్పుబడితే అప్పుడు నవ్వుల పాలవుతోంది.

కొందరు కావాలని ఇలా చేస్తున్నారని, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్  కు వ్యతిరేకంగా పనులు చేస్తు బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు వాపోతున్నారు. కావాలని ఎమ్మెల్యే టార్గెట్ చేసి హైలెట్ అవ్వాలని చూస్తున్నారని మాట్లాడుకుంటున్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి