Friday, November 22, 2024

TSPSC SCAM : టీఎస్పీఏఎస్సి స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దది : బండి

తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారు. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారు.

గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ TSPSC స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోంది. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా మెయిన్స్ కు అర్హత సాధించారు. ఒక చిన్న గ్రామం నుంచే 6 గురు క్వాలిఫై అయ్యారు. వీళ్లంతా ప్రతిభావంతులు అనుకుంటే పొరబాటే… బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లు కావడం వీళ్లకున్న ఎక్స్ ట్రా క్వాలిఫికేషన్.

🔸 నలుగురు బీఆర్ఎస్ సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో ఛైర్మన్ కొడుకుతో పాటు ఒక జడ్పీటీసీ బాడీగార్డ్ కొడుకు క్వాలిఫై అయ్యారు.

🔸 ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన క్వాలిఫై చేశారు. ఇదంతా కేసీఆర్ కొడుకు కనుసన్నల్లోనే జరిగింది. ఇందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.

🔸 నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలిప్పిస్తున్న కేసీఆర్ కొడుకును తక్షణమే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి.

సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యం ?
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు అభ్యంతరం ఎందుకు ?
నయీం డైరీ, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మియాపూర్ ల్యాండ్ కేసు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ కేసు తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోంది.

లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై మరిన్ని వాస్తవాలను అతి త్వరలోనే బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందు నిలబెడుతాం.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి