బోథ్ : ఆదివారం రోజు బోథ్ మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం లోని రైతు వేదికలో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎంపిపి తుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ కి సంబంధించిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని అన్నారు. సర్పంచ్ల మరియు ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు విద్యుత్ స్తంభాలను అమర్చాలని ఆదేశించారు. అలాగే గ్రామీణ మంచినీటి సరఫరా మెరుగుపరచాలని అన్నారు. వివిధ గ్రామ పంచాయతీలలో లీకేజీ లను త్వరగా పూడ్చి వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులకు ఏవైనా కొత్తగా ప్రభుత్వం నుండి సర్కులర్ వచ్చినచో వెంటనే గౌరవ ఎంపిటిసి లకు సర్పంచులకు అందించాలని ఆదేశించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటిడోసు జిల్లాలోనే మొట్టమొదటిగా వంద శాతం పూర్తి చేసుకున్నాము అలాగే రెండవ డోసు కూడా త్వరిత గతిన 100% పూర్తి చేసుకొని బోథ్ మండలాన్ని ఆదర్శంగా ఉంచుతామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులు సర్పంచులు ప్రజా ప్రతినిధులు వైద్య సిబ్బందిని అభినందించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంగా పనిచేసి మండలాన్ని ఆదర్శంగా నిలుపుదాం అన్నారు.
ఇట్టి సమావేశంలో ఎంపిడిఓ రాధా రాథోడ్ , వివిధ గ్రామ పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పిటిసి సంధ్యారాణి, వైస్ ఎంపిపి లింబా జి, తాహెర్ బిన్ జడ్పి కోఆప్షన్ మెంబర్ , కదం ప్రశాంత్ పిఎసిఎస్ చైర్మన్ , శ్రీధర్ రెడ్డి సర్పంచులు అధ్యక్షులు హాజరయ్యారు.

Recent Comments