**
*బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గారి చొరవతోనే నియోజకవర్గానికి రూ. 15 కోట్లు మంజూరు*
*బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్*
బోథ్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతూ ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వంతో కోట్లాడి ఒప్పించి కన్విన్స్ చేసి నియోజకవర్గ అభివృద్ధికి (సీఆర్ఆర్) ఎస్సి సబ్ ప్లాన్ ద్వారా జీవో నం. 78 లో భాగంగా రూ. 10 కోట్లు అదేవిధంగా STSDF గ్రాంట్లో భాగంగా రూ. 5 కోట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ చొరవతో మంజూరు అయ్యాయని బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు మజర్ తెలిపారు. అభివృద్ధిని ఓర్వలేకనే కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు లెటర్ పెట్టి చక్కర్లు కొడుతున్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా నిధులు మంజూరు కావని ఇన్నిత జ్ఞానం లేకుండా ఒక లెటర్ క్రియేట్ చేసి షో చేస్తున్నారని అలాంటి తప్పుడు లేటర్లను ప్రజలు నమ్మొద్దని అన్నారు. గత సంవత్సరంలోనే ఎమ్మెల్యే గారు ప్రభుత్వానికి నివేదికలు అందించారని ఎమ్మెల్యే సిఫార్సుతోనే ఎమ్మెల్యే గారు పెట్టిన పనులే ఈరోజు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజాక్షేత్రంలో ప్రజలచే ఎన్నుకోబడిన వారిని అగౌరపరచడం కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచే అలవాటాని మండిపడ్డారు. ప్రజలకు అనుమానం ఉంటే అధికారులను అడగవచ్చని ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు తేవడంలో మన ఎమ్మెల్యేగా అనిల్ జాధవ్ గారు కీలక పాత్ర పోషించనున్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ ఓర్వలేకనే కార్యకర్తలతో ఇలాంటి చిల్లర ప్రచారాలకు తావు తీస్తుందని అన్నారు.
Recent Comments