Thank you for reading this post, don't forget to subscribe!
తెలంగాణలో అధికారంలోకి రావాలి అనుకుంటున్న బీజేపీ కి అది లోనే చిక్కులు తప్పేలా లేవు. జిల్లాలో బీజేపీ నాయకుల తీరు చూస్తే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తప్పితే ప్రజల కోసం పనిచేసే తీరు వాళ్ళలో మచ్చుక అయిన కనబడటం లేదు. అదిలాబాద్ లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ కి విజయ అవకాశలు మెండుగా ఉన్నాయి కానీ క్షేత్ర స్థాయిలో కష్టపడే కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో నాయకులు ముందుకు వెళుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు లోలోపల విమర్శలు చేస్తున్నారు. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు ఎలాంటి లాభాపేక్ష లేకుండా చిన్న చితక పనులు చేస్తూ బీజేపీ కోసం పనిచేస్తుంటే వాళ్ళకి నేను ఉన్నాను అని బరోసా ఇచ్చే నాయకుడు కరువు అయ్యాడు. కొందరి పరిస్థితి చూస్తే వాళ్ళు వ్యక్తిగత భజన ఎక్కువ అయ్యింది, భజన ఎవరైతే చేస్తారో వాళ్ళనే నాయకులు పట్టించుకుంటున్నారని అంటున్నారనేది కూడా బిజెపిలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంది బీజేపీ పరిస్థితి ఇలాగే ఉంటే డిపాజిట్ కూడా గల్లంతు అయ్యే అవకాశం ఉంది.
బీజేపీ అధిష్టానం ఇకనైనా దృష్టి పెట్టి పరిస్థితులు చక్క బెడితే రానున్న రోజుల్లో జాతీయవాదులు , హిందుత్వ వాదులు , పార్టీ సానుభూతిపరులు మరింత కష్టపడి బిజెపిని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడతారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. మళ్లీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోనీ అడెల్లి పుణ్యక్షేత్రం నుండి ప్రారంభం అయ్యింది. ఇప్పటికైనా అందరూ ఏకతాటి పైకి వచ్చి అదిలాబాద్ జిల్లాలోని బిజెపిలో ఉన్న అంతర్గత సమస్యలన్నింటినీ తొలగించి అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరిలో ఒకే బావన దేశ హితం అనే భావన అందరిలో తీసుకొస్తే, పాదయాత్ర ద్వారా మరింత అదిలాబాదు బిజెపి శ్రేణుల్లో జోష్ ని పెంచినట్లయితే* అదిలాబాదులో బీజేపీ అనుకున్న సీట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తుంది.
Recent Comments