ఆదిలాబాద్ : జిల్లా ఇచ్చోడ మండలంలో బిజెపికి బిగ్ షార్ తగిలింది. బీజేపీ పార్టీ ఇచ్చోడ మండల మాజీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు ( రెండు సార్లు) , సొసైటీ బ్యాంక్ పిఏసిఎస్ వైస్ చైర్మన్, జామిడి విడిసి చైర్మన్ హరన్ మారుతి పటేల్ బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గం నాయకులు ఆడే గజేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా హరన్ మారుతి పటేల్ మాట్లాడుతూ
కొత్తవారు బీజేపీ లో వచ్చి పాత కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేవలం సర్వేల పేరిట ప్రజలను మోసం చేసిందని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రజలకు రేషన్ కార్డులు మరియు ఇండ్లు వంటి పథకాలు అమలు చేస్తుండడం చూసి పాలన నచ్చడంతో పాటు ఆడే గజేందర్ పార్టీ కార్యకర్తలకు అందిస్తున్న కృషిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.
Recent Comments