ఇచ్చోడ : కూలీ మరియు ఇతర పనులు చేసుకుని బ్రతికే కుటుంబాల పాలిట బెల్ట్ షాపులు శాపంలా మారాయి..
ఉదయం పానికెళ్లి కుటుంబాన్ని పోషించాల్సిన కుటుంబ పెద్ద ఉదయమే మందు అందుబాటులో ఉండడంతో తాగడంతో ఎన్నో కుటుంబాల్లో మద్యం చిచ్చు రేపుతోంది.
ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల కేంద్రంలో బెల్టు షాపులా పుణ్యమా అని మందు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇది ఎలాగో ఇల్లీగల్ దందా కాబట్టి ప్రభుత్వ నిబంధనలు ఏమి వర్తించవు. అయితే ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి ఉండే బెల్ట్ షాపులు, ప్రజలకు ప్రతి 200 మీటర్ల దూరంలో ఒక బెల్ట్ షాప్ ఉండడంతో తాగే వారికి ఇబ్బంది లేకుండా పోతుంది.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ బెల్ట్ షాపుల పై అప్పటి ప్రభుత్వం పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే .
గల్లి , గల్లి కొక బెల్ట్ షాపు ఉన్న వీటి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది అంతుచిక్కని ప్రశ్న. . ఎక్సైజ్ శాఖ కార్యాలయం చుట్టూ ప్రక్కల నే సుమారు 10 బెల్ట్ షాపులు ఉన్నట్లు సమాచారం. అయితే అధికారులు ఇటు వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదు అనేది పలు సందేహాలకు తావిస్తుంది. ఏదేమైనా ఇలా టైం కానీ టైంలో ఏని టైమ్ మందు దొరకడంతో చాలా మంది పనికి వెళ్లకుండా మద్యం మత్తులో అంటున్నారు.

Recent Comments