— కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అనుమతి లేకుండా పుట్టగొడుగుల్లా వెలిసిన ల్యాబ్ ల పై చర్యలు తీసుకోవాలని
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యం చేయడంతో ఆదిలాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా సామా రూపేష్ రెడ్డి మాట్లాడుతూ
అదిలాబాద్ జిల్లాలోని బేల మండల కేంద్రంలో అనుమతి లేకుండా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కొనసాగుతున్న ల్యాబ్ లపై చర్యలు తీసుకోవాలని గత పక్షం రోజుల క్రితం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి అన్నారు.
దీంతో పేద ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆర్ఎంపీ వైద్యుల వద్దకు వెళ్తే వారు రక్తపరీక్షలు చేసుకోవాలని సూచించడంతో ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని బేలా మండల కేంద్రంలో ల్యాబ్ లు ఏర్పాటు చేసుకున్న యజమానులు వేలకు వేల రూపాయలు రక్త పరీక్షల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నరని అన్నారు.
కాయకష్టం చేసుకుని బ్రతికే పేద ప్రజలు చేసేదేమీ లేక రక్త పరీక్షలకు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని అన్నారు.
ఇలాంటి వారికి చైతన్యం కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని చూపించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఇంతవరకు పట్టించుకోవడం లేదన్నారు. ల్యాబ్ నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుంటున్నట్టు మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని , దీనిపై విచారణ జరిపించి ఇప్పటికైనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా బేలా మండల కేంద్రంలో వెలిసిన ల్యాబ్ లపై చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కోరడం జరిగిందన్నారు. అయితే సానుకూలంగా స్పందించిన జిల్లా వెంటనే ఎంక్వైరీ చేయించి అనుమతులు లేకుండా నడిపిస్తున్న ల్యాబ్ పై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ను పిర్యాదు చేసిన వారిలో ఎస్సీ సెల్ నియోజకవర్గ ఇంచార్జి చైర్మన్ చంద్రాల రాహుల్, తాయిర్, షపిక్, నుస్రత్ ఖాన్, తదితరులు ఉన్నారు.
Recent Comments