
- బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్
ఆదిలాబాద్/ఇచ్చోడ : అణగారిన వర్గాల సమస్యల పరిష్కారం కై లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్ర చేపట్టినట్లుగా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ అన్నారు. మంగళవారం ఇచ్చోడ మండలంలోని మొక్రా బి గ్రామానికి చేరుకున్న లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర చేరుకున్న సందర్భంగా మాట్లాడారు. 10 శాతం లేని రెడ్డి , రావులు తెలంగాణాలో అధికారాన్ని శాసిస్తున్నారని ఆరోపించారు.



అందుకే బీసీ ఎస్సి ఎస్టీలకు అధికారం సాధించేందుకు మా భూమి రథయాత్ర చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ప్రజా సమస్యలను తెలుస్కుని కలెక్టర్, ముఖ్యమంత్రి తో పరిష్కరింప జేసేందుకు 12వేల గ్రామల్లో వినతి పత్రాలు స్వీకరించడమే కాకుండా స్వయంగా ప్రజల భాదలు తెలుసుకుంటున్నట్లుగా తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా బీసీ ఎస్సి ఎస్టిలు దయనీయ పరిస్థితుల్లో బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమిలేదు ఇండ్లు లేవు విద్య వైద్యం ఉపాధి అసలే లేదని అన్నారు. బీసీ ఎస్సి ఎస్టిలకు అధికారంతో పాటు సమస్త హక్కులు సాధించేందుకు ఈ ప్రజాయాత్ర మా భూమి రథయాత్ర చేపట్టినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో బీసీ ఎస్సి ఎస్టి జే ఏ సి రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్, చిన్న లక్ష్మణ్, అశోక్, భూమన్న, నరేష్, తదితరులు పాల్గొన్నారు.


Recent Comments