epaper
Wednesday, January 21, 2026

బంద్ విజయవంతం
బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

ఆదిలాబాద్, ఇచ్చోడ :  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్చేస్తూ ,బీసీ సంఘాలు పిలుపుమేరకు శనివారం రోజున అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా బీసీ సంఘం నాయకులు ఒకరోజు ముందు దుకాణ దుకాణానికి వెళ్లి బందు పాటించాలని పిలుపు ఇవ్వడంతో శనివారం నా బంద్ విజయవంతమైంది.

శనివారం ఉదయం బీసీ సంఘం నాయకులు ఇచ్చోడ లోని వీధులలో తిరుగుతూ , దుకాణాలు తెరవకుండా మూసి వేయించారు ..బందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించిన తో పాటు బాండ్ లో పాల్గొన్నారు .బంధు సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో రాస్త రోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ సంఘం మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి నరాల రమణయ్య పెళ్లి నరేష్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచకుంటే తమ ఉద్యమము తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు రిజర్వేషన్లు తమ హక్కు అని, రిజర్వేషన్లు అమలుపరిచే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు .దేశానికి స్వతంత్రం వచ్చి 70 గడుస్తున్న ఆర్థికంగా, రాజకీయంగా , సామాజిక  రంగాలలో అగ్రవర్ణాలే పెత్తనం కొనసాగుతుందని జనాభాలో 56% ఉన్న బీసీలకు మొండిచేయి దక్కుతుందని వారు ఆవేదన  వ్యక్తం చేశారు బీసీల ఉద్యమం ఇది ప్రారంభమైందని ఇక ఈ ఉద్యమము దేశవ్యాప్తంగా కొనసాగి దేశంలో బీసీల రాజాధికారం రావాల్సిందని వారు అన్నారు ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించి రాస్తా రోకో లో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు ఏనుగు కృష్ణారెడ్డి ,బిజెపి మండల అధ్యక్షుడు రమేష్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి ,ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నేల లక్ష్మణ్, బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు పోశెట్టి ,న్యాయవాది దంపాల్ ,ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డిలు బీసీ సంఘం నాయకులు గాడ్జే సుభాస్,,మేరాజ్ అమ్మద్,అబ్దుల్ అజీజ్ ,వెంకటేష్ సామల సుదర్శన్ ,బాలాజీ ,గణేష్, నరాల రవీందర్, బలగం రవి జాదవ్ కిరణ్ ముండే పాండురంగ్, మహదేవ్ న్టే బాబా రావ్ కదా పాన్ పట్టే సుభాష్
ముండే , పాండురంగ్,లక్ష్మణ్ చారీ,,శ్రీనివాస్ తదితరులు పాల్గొని బీసీ రిజర్వేషన్ లను అమలు  చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు .రిజర్వేషన్ ఉద్యమంలో తమ వంతు పూర్తి మద్దతు, సహకారం అందజేస్తామని బిజెపి కాంగ్రెస్ బీఎస్పీ ధర్మ సమాజ పార్టీ ఎంఐఎం పార్టీలు నాయకులు తెలియపరిచారు బంద్ సందర్భంగా ఏలాంటి  అవాచనీయ సంఘటన  జరగకుండా ఇచ్చోడ పోలీస్ సిఐ బండారి రాజు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాస్తారోకో చేస్తున్న బీసీ నాయకులను, వివిధ పార్టీల నాయకులను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు.

బస్సులు బందు వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకొని తిరిగి వెళ్లారు . ప్రైవేట్ విద్యాసంస్థలు బంధ్ సందర్భంగా ఒకరోజు ముందే సెలవు ప్రకటించారు బంద్ కు సహకరించిన వ్యాపార సంఘాలకు, వివిధ పార్టీల నాయకులకు బీసీ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!