Thursday, November 21, 2024

ఈ వైద్య సిబ్బంది చేసిన పనికి యావత్ భారత్ దేశం ఫిదా అయింది…

ఆ గ్రామం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నుర్ మండలం కేంద్రం నుండి 6 కి.మీ.ల దూరం లో ఉంది. వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేదు. 3 కి.మీ. లు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. పైగా ఉదృతంగా ప్రహించే వాగును నడుము లోతు నీరు దాటాలి. ఇదంతా తెలిసి కూడా ఆ వైద్య సిబ్బంది సహహసానికి ఒడిగట్టారూ.

బజార్ హత్నుర్ ఆస్పత్రి మండల వైద్యాధికారి డాక్టర్ సురేష్ ,సిహెచ్ఓ డాక్టర్ ఇక్రం , ఏ ఎన్ ఎం అనిత , కానిస్టేబుల్ జంగు ,గిర్ణుర్ సర్పంచ్ కృష్ణ , పంచాయతీ సెక్రెటరీ సాయి, ఆశ వర్కర్ దుర్గా లు ఈ సాహసం చేసి చరిత్ర సృష్టించారు.

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నుర్ మండలం వైద్య సిబ్బంది సంచలనానికి నాంది పలికారు. బజార్ హత్నుర్ మండల కేంద్రం నుండి 6 కి.మీ. లు రోడ్డు సౌకర్యం లేని కొత్తపల్లి గ్రామానికి వ్యాక్సినేషన్ వేయడానికి వెళ్లారు. 6 కి.మీ. లలో 3 కి.మీ. కాలి నడకన వెళ్లారు. అయితే మధ్యలో ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి వెళ్లడంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ సిబ్బంది చేసిన పనికి ఫిదా అయిపోయారు ప్రజలు . గ్రామంలో 112 మందికి టీకా వేశారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి