షార్ట్ సర్క్విట్ తో చేతికి వచ్చిన జొన్న పంట అగ్గిపాలు.
రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : బజార్ హత్నూర్ మండల కేంద్రానికి చెందిన రైతులు కళ్లెం విట్టల్, కళ్లెం భూషణ్ వారి పొలంలో రబీ సీజన్లో రెండు ఎకరాలలో జొన్న పంట వేశారు. ఈపంట కాపుకు వచ్చి ఒకటీ రెండు రోజులలో కోత కొద్దామనే లోపు కరెంటు ప్రమాదా నికి కు గురి అయి సోమవారం రోజు జొన్న చేను కాలిపోయింది. జొన్న కంకులు కాలి భూడిదఅయింది అని రైతులు వాపోయారు.రైతుల చేను మద్యల నుంచి జాతర్ల ఫీడర్ కు 11 కే వి విద్యుత్ లైన్ వెళ్ళుటతో ఆదివారం రోజు నిన్నటి గాలి దుమారానికి తీగలు రాపికిడికి గురై ఈ ప్రమాదం సంబవించినట్లు రైతులు తెలియజేసారు. ప్రభుత్వం నష్ట పోయిన రైతులను ఆర్ధికం గా ఆదుకోవాలని గ్రామస్తులు సదరు రైతులు కోరుతున్నారు.
సుమారు పంట నష్టం విలువ రూపాయలు 1,50,000 వరకు నష్టం జరిగినట్లు రైతులు తెలియజేసారు.
Recent Comments