Saturday, March 22, 2025

సాత్ నెంబర్ లో ఘనంగా తీజ్ పండుగ వేడుకలు….

వేడుకల్లో పాల్గొన్నా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్….

రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చోడా : ఇచ్చోడ మండలంలోని సాత్ నెంబర్ గ్రామంలో బంజారా సమాజంలో నిర్వహించినా తీజ్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం రోజు భక్తిశ్రద్ధలతో గ్రామస్తులు ఈ పండుగను ఘనంగా నిర్వహించారు.

తీజ్ వేడుకల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూన్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

వేడుకలకు ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడితే అవి మనల్ని మంచి మార్గం లో నడిపిస్తాయని అన్నారు. మరియమ్మ తల్లి ఆశీర్వాదం తో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు , యూత్ సభ్యులు ఆయను శాలువ తో సత్కరించారు. కార్యక్రమంలో ఇచ్చోడా ఎంపీపీ నిమ్మల ప్రితం రెడ్డి , నెరదిగొండ ఎంపిపి రాథోడ్ సజన్ , ఎంపీటీసీ గాడ్గే సుభాష్ , అజిమ్ , పవార్ నూర్ సింగ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

తీజ్ వేడుకల్లో చిన్నారులతో రాథోడ్ బాపురావ్ మరియు ఇతర నాయకులు

Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి