రూ.16,470 ల నగదు, పేకాట ముక్కలు స్వాధీనం.
మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
వివరాలు వెల్లడించిన స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జె కృష్ణమూర్తి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాద్ నగర్ ఏరియా లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం రావడం తో ఎస్బి ఇన్ స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పేకాట స్థావరం పై దాడి చేయగా అందులో పేకాట ఆడుతున్న ఐదుగురు సంఘటనా స్థలంలో పట్టుకున్నారు. పట్టుబడ్డ వారి వివరాలు.
1) షేక్ పాష
2) షేక్ ముస్తాక్
3) మహమ్మద్ అబ్దుల్ నవీద్
4) మహమ్మద్ ఫయాజ్ ఉద్దీన్
5) సయ్యద్ అఫ్జల్
వీరందరూ ఆదిలాబాద్ పట్టణం షాద్ నగర్, టీచర్స్ కాలనీ, సంజయ్ నగర్ కు చెందిన వారని సిఐ తెలిపారు. వీరి వద్దనుండి పేకాట ముక్కలు, రూ.16,470 ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును మావల పోలీస్ స్టేషన్లో అప్పగించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఏఎస్ఐ గణపతి, కానిస్టేబుల్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments