Friday, November 22, 2024

పెసా చట్టం పంచాయితీల ( షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు) 1996 యొక్క నిబంధనల ప్రకారం పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగింది.


జిల్లా పాలనాధికారి రాజర్షి షా.

అదిలాబాద్ జిల్లా :  PESA చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం ఏ ప్రభుత్వ శాఖ అయినా చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి స్థానిక గ్రామ సభ తీర్మానం తప్పనిసరి .
ఈ గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరు సభ్యులే.  గ్రామసభ నిర్వహణకు కావలసిన కోరం 1/3.  అందులో  కనీసం 50 శాతం గిరిజనుల హాజరు తప్పనిసరి.  అట్టి తీర్మానాల నిర్ణయాలను నాలుగు వారాల లోపు సంబంధిత శాఖకు సమర్పించాలి.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి
తహసీల్దార్లు, ఎంపీడీవో, mpo, SDC, తదితర సిబ్బందికి ఇట్టి వాటి పై పవర్
పాయింట్ ప్రజంటేషన్ ద్వార అవగాహన కల్పించడం జరిగిందనీ గిరిజనుల హక్కుల కు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు .
1 of 70 నిబంధనలు
భారత రాజ్యాంగం లోని 5 వ షెడ్యుల్ అధికరణలు 15,16, 46, 244, 275, 330, 322, 334, 335, 338, 339, 342,   గిరిజనులకు రక్షణ , గిరిజనుల సామాజిక పద్ధతులు, ఆచార  వ్యవహారాలు, జీవన విధానం మిగితా మైదాన ప్రాంతవాసులకు భిన్నంగా ఉండటడం, గిరిజనుల కొరకు 
1 of 70 చట్టాలు రూపొందించబడ్డాయి.

రాజ్యాంగం కల్పించిన రక్షణలు
ఎన్నికలలో రిజర్వేషన్, ఏజెన్సీలో ST లకే పదవులు, విద్యా వసతులు, ఉద్యోగాలలో ఏజ్ సడలింపు,
వడ్డీ వ్యాపారుల నుంచి సంరక్షణ ,  ఆదివాసుల భూమి రక్షణ కోసం, మైదాన ప్రాంతవాసులు ఏజెన్సీ లోకి వలస రాకుండా అడ్డుకోవడం.
1/1959 రెగ్యులేషన్ ప్రకారం 01.12.1963 నుండి గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు చెల్లదు.
1/70 నియమాల ప్రకారం 03.02.1970 నుండి గిరిజనుల లేదా గిరిజనేతరుల భూ బదలాయింపు గిరిజనేతరులకు చెల్లదు.

గిరిజనుల,  గిరిజనేతరులకు మధ్య నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి ఏజెన్సీ కోర్టులను ఆశ్రయించాలి.

షెడ్యుల్ ప్రాంతాల్లో పూర్తి హక్కులు గిరిజనులకు కలవు.

ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘించినచో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష,  లేదా 2 వేల రూపాయలు జరిమానా  లేదా రెండూ విధించవచ్చు .


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి