రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి, 6 నెలల క్రితం మృతి చెందిన ఆడ రేణుక w/o విజయ్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని తుడుం దెబ్బ నాయకులు కోడప నగేష్ డిమాండ్ చేసారు. మృతురాలి కుటుంబానికి సంబంధించి ఆరోగ్య శాఖ మరియు సంబంధిత ఇతర శాఖలు స్పందించి, రేపు అనగా 08-10-2024 నాడు ఇచోడా మండలం మానుకుగూడ గ్రామంలో సంబంధిత శాఖల వారు వచ్చి మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొడప నగేష్, తుడుందెబ్బ, కుంరం జంగు, గ్రామ పటేల్, కుడుమేత భుజాంగరావు, గ్రామ దేవరీ, నైతం కేశవ్, గ్రామ మహాజన్ , కుడుమేత జంగు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments