— ఆదివాసీ సేన ములకలపల్లి మండల కమిటి
◾️ ఆదివాసీ నాయకులనూ బెదిరించడం, దాడులు చేపించడం సిగ్గు చేటు
◾️గిరిజనేతరులు ఏ పార్టీ లలో ఉన్న అందరూ ఒకటే అని గమనించాలని సూచన…
ములకలపల్లి (జనవరి 31) : గిరిజనేతరుల ఐక్యత , రాజకీయాల ఎత్తుగడకు ఆదివాసులు బలి కావాల్సిన పరిస్థితులు ఏర్పడడం , ఆదివాసీ నాయకులనూ బెదిరించడం, అమాయక ఆదివాసి యువత పై దాడులు చేపించడం సిగ్గు చేటు అని ఆదివాసీ సేన ములకలపల్లి మండల కమిటి ఉపాధక్ష్యుడు తానం శివ కృష్ణ అన్నారు.
ఈ మేరకు సంఘ అత్యవసర సమావేశంలో నాయకులు మట్లాడుతూ.. గిరిజనులకు జరుగుతున్న అన్యాయయాలనూ ప్రశ్నిస్తూ, ఆదివాసీ సమాజం లో ఆదివాసీ సేన యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేక, ఆదివాసుల మధ్య ఐక్యతనూ విచ్చినం చేయడానికి గిరిజనేతరులు చేసిన పన్నాగంలో భాగంగా ఇటివల ముత్యాలంపాడు లో జరిగిన ప్లేక్సి వివాదం అని అన్నారు, ముఖ్యంగా తాటి వెంకటేశ్వర్లు మాజీ ఎమ్మెల్యే ముందుపెట్టి, దాడులు , బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారు ఎన్ని ఎత్తులు వేసిన, వాటిని ఆదివాసీ సమాజం నిశితంగా గమనిస్తున్నదని అన్నారు. అంతేకాకుండా అక్రమంగా ఆదివాసీ యువతనూ పోలీస్ స్టేషన్లో నిర్భందించడం మరియు 50 మంది గిరిజనేతరులు మాకుమ్మడిగా ఆదివాసి యువతపై దాడులు చేసిన, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం చూస్తే ఆదివాసుల పైన , వారిపైన దాడులు చేపించటంలో ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని, భవిష్యత్తులో జరిగే దాడులకు గాని, సేన జిల్లా కన్వినర్ ఊకె రవి పై ఎలాంటి దాడులు జరిగిన దానికి పూర్తి భాద్యత తాటితో పాటు సిపిఐ, సిపిఐ ఎంఎల్ ప్రజపంథా , పొంగులేటి వర్గం,ఇంకా కొన్ని పార్టీ లు బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు.గిరిజనేతరులు, గిరిజనల మీద దాడులు చేసినటూ వంటి విషయములో, గిరిజనేతరులకు అధికారులకు మధ్య గల స్నేహం నూ ప్రజలు గమనించాలని, గిరిజనేతరుల పై నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయని, అన్ని వర్గాల నుంచి గిరిజనుల మీద త్రివామైన ఒత్తిడులు చేస్తున్నారని అన్నారు. సమాజంలో గిరిజనులకు జరిగే న్యాయాలు ఎలా, అధికారుల తీరు తెన్నులు ఎలా వున్నాయో అర్థం చేసుకోవచ్చు అని, గిరిజనులకు అన్యాయంగా తప్ప, న్యాయం జరిగే పరిస్థితులు ఇక ముందు ఉండబోవని అన్నారు. సరైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు.తానం శివకృష్ణ ,సోడే శ్రీను, వాడే యా,కోర్రి నాగేష్ ,కీసర నాగేష్ ,కారం వెంకటేష్, కట్టం రమేష్ ,కొండ్రు రాంబాబు, తాటి నరేష్, కారం వెంకటేష్, పర్షిక నరసింహారావు, కీసర రాజులు, కారం పోతురాజు లు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments