తెలంగాణలో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలువనున్న ఆదివాసీసేన మరియు ఆదివాసి సంఘాల బృందం * ఆదివాసి సేన జిల్లా ఉపాధ్యక్షులు వజ్జా జ్యోతిబసు*
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, మార్చి 28 మణగూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి ప్రాంతాల పట్ల, ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదని ఆదివాసీల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అక్రమ పద్ధతులు 11 కులాలు కలపడం రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ జ్యోతి బసు అన్నారు.
మంగళవారం నాడు మణుగూరు మండలం ఆదివాసీసేన విస్తృత సమావేశం నాగరాజు అధ్యక్షుతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వజ్జ జ్యోతిబాసు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు పేరుతో అధికారo లోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల యొక్క మనుగడును ప్రశ్నించే విధానము అవలంబిస్తుందని దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా వారు తెలిపారు. రాష్ట్రంలో ఎస్టీలకు 10% రిజర్వేషన్ పేరుతో జీవో తీసుకొచ్చి గిరిజనులు కానీ కులాలను తెగలు లో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతాల యొక్క చట్టాలు నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆదివాసులు అభివృద్ధికి, ఉపాధికి మొండి చేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి,కేటీపీఎస్,బిపిఎల్, నవభారత్, బి టి పి ఎస్, తెలంగాణ జెన్కో, టూరిజం, ఇసుక సొసైటీలు తదితర పరిశ్రమల్లో ఎంతమందికి ఉపాధి కల్పించారో తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదావరి నదిపై కట్టిన ప్రాజెక్టులు, ఆనకట్టలు, బ్యారేజీల ద్వారా ఎన్ని గిరిజన గ్రామాలకు త్రాగునీరు సాగునీరు ఇచ్చారు చెప్పాలి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బహుళార్థకసాధక సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి పరిహారం నిర్వాసితులకు ఇవ్వలేదని, పర్యావరణ అనుమతులు లేవని ఇట్టి విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేయగా రాష్ట్ర ప్రభుత్వం పైన మొట్టికాయలు వేస్తూ స్టే ఇచ్చిందని తెలిపారు. ప్రశ్నించే గొంతుకలని తెలంగాణ ప్రభుత్వం అరెస్టులు చేయడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను గురిచేస్తుందని ఈ చర్యలను ప్రజాస్వామిక వాదులు హర్షించరని తెలిపారు. జీవో నెంబర్.3 రద్దయినప్పటికీ, నేటి వరకు ఎలాంటి ఆదివాసులు ఉద్యోగాల కోసం కోసం కొత్త జీవోలు తీసుకురాలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గిరిజనేతరుల వలసలు అడ్డుకోలేని ప్రభుత్వం గిరిజన చట్టాలు రద్దు చేయాలని ఏజెన్సీలోని గిరిజనేతరులతో ప్రదర్శన నిర్వహిస్తూ కోర్టులో పరోక్షంగా కేసులు తెలంగాణ ప్రభుత్వం వేయిస్తుందని విమర్శించారు. లేకపోతే లీగల్ ఎయిడ్ నిధులు కూడా ఐటీడీఏలకు మంజూరు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సిన తెలంగాణ ప్రభుత్వం ఆ చర్యలు నుండి తప్పుకుంటుందని ఫలితంగా సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఆదివాసులు ఎదుర్కొంటున్న
మొత్తం సమస్యలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు తమిళసై గారి దృష్టికి శ్రీరామనవమికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి ఆదివాసి సేన మరియు తెలంగాణ ఆదివాసి సంఘాలు రాష్ట్ర బృందం తరపున వినతి పత్రాలు అందిస్తామని జిల్లా ఉపాధ్యక్షులు వజ్జ జ్యోతిబసు తెలిపారు. పరిష్కరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
సమావేశంలోఆదివాసీ సంఘాల నాయకులు జిల్లా మరియు మండల నాయకులు గనిబోయిన ముత్తయ్య పుణ్యం నాగరాజు బండారి కృష్ణ గనిబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments