- ఆదివాసి అడ్వకేట్స్ అసోసియేషన్
రిపబ్లిక్ హిందూస్థాన్, హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ , ఖమ్మం జిల్లాలలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులు పెందోర్ పుష్ప రాణి, కొండ్రు సుధారాణిలను రాజకీయాలకు అతీతంగా గెలిపించాలని ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కోరారు. ఈ సందర్భంగా పోటీ చేస్తున్న ఆదివాసీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసిలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలకు సరైన అవకాశాలు కల్పించలేదన సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా షెడ్యూల్ ప్రాంతాల ఆదివాసీలకు , ప్రజా ప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని, రాజ్యాంగ ఫలాలు అన్ని నేడు ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మారాయని అన్నారు. నేడు అత్యంత వెనుక బడిన తెగలకు సముచిత స్థానం ఇవ్వాల్సి వున్న, ఆ దిశగా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కృషి చేయడం లేదని అన్నారు. ఆదివాసీలు వారి యొక్క రాజ్యాలలో స్వేచ్ఛా, సమానత్వం,స్వయంపాలన, ధర్మ , న్యాయ బద్ధమైన పరిపాలననూ అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, నేడు ఆదివాసీ అభ్యర్థులను ఎమ్మెల్సీ స్థానాలలో రాజకీయాలకు అతీతంగా గెలిపించాల్సిన భాధ్యత ఆయా జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో పాటు, ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంత ప్రజా ప్రతినిధులకు వుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషన్ కన్వీనర్లు అరెం పాపారావు, చీమల నరసింహరావు, సున్నం రమేష్, మడి సాయిబాబు, సిడం వివేకానంద,
సోడే వెంకటేశ్వర్లు, కో కన్వీనర్లు సువర్ణపాక సత్యనారాయణ, చందా హనుమంతు, కిసరి శ్రీనివాస్, పర్షిక సోమరాజు, తామ బాలరాజు,తెల్లం ఆదినారాయణ, అత్రం నవీన్,దనసరి నర్సింహమూర్తి, కోర్స నరేష్, స్టాలిన్ పాటు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments